బయో మెట్రిక్ వెయ్యకపోతే తొలగిస్తాం

 

బయో మెట్రిక్ వెయ్యకపోతే తొలగిస్తాం


జూన్ 15 నాటికి పి.హెచ్.సి ల మరమ్మత్తులు పూర్తి కావాలి

జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి

విజయనగరం, మే 27 (ప్రజా అమరావతి):: ఆసుపత్రులలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది  తప్పనిసరిగా బయో మెట్రిక్ హాజరు వేయాలని , వెయ్యని వారిని  ఇంటికి పంపిస్తామని కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. బయో మెట్రిక్ యంత్రాలన్నీ పని చేసేలా చూడాలని, అవసరమైతే అదనపు యంత్రాలను సమకూర్చు కోవాలని డి.ఎం.హెచ్.ఓ, డి.సి.హెచ్ లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్షించారు. పి.హెచ్.సి, సి.హెచ్.సి , జిల్లా ఆసుపత్రి, గోషా ఆసుపత్రుల బయో మెట్రిక్ హాజరును తనిఖీ చేశారు. అనేక మంది హాజరు 50 శాతం కన్నా తక్కువ ఉండడం, ఎక్కువ మంది  సెలవుల్లో ఉన్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరు లోగా బయో మెట్రిక్ క్రమబద్ధీకరణ జరగాలని, అన్ని ఆసుపత్రులకు వెంటనే సర్కులర్ జారీ చేయాలని సూచించారు.   

ఆర్ అండ్ బి ద్వారా  మరమ్మత్తులు  చేపడుతున్న 26 పి.హెచ్.సి భవనాలకు త్వరగా మరమ్మతులు పూర్తి చేసి జూన్ 15 నాటికి అప్పగించాలని ఎస్.ఈ జయ శ్రీ కు ఆదేశించారు. అదే విధంగా కొత్తగా నిర్మిస్తున్న చల్లపేట, జామి పి.హెచ్.సి లను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మందులను  ఎంత పరిమానం లో వచ్చాయి, ఎక్కడెక్కడ ఎంత పరిమాణం లో ఎంత మంది కి వినియోగిస్తున్నారు, ఎక్సఫైరీ తేదీ తర్వాత  ఏమైనా మిగిలి ఉంటున్నాయా తదితర అంశాల పై  ఆడిట్  నిర్వహించాలని డి.ఎం.హెచ్ ఓ రమణ కుమారి, డిసిహెచెస్ లక్ష్మణ రావు కు ఆదేశించారు.  జిల్లాలో  రామభద్ర పురం, మెంటాడ లో రెండు మలేరియా కేస్ లు నమోదైన దృష్ట్యా కేసులు ఇంకా పెరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మలేరియా అధికారి తులసి కి ఆదేశించారు. మోడల్ గ్రామాలైన జమ్మూ, కర్లం, నందిగా0 వంటి గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి మిగిలిన గ్రామాల్లో అమలు జరిగేలా చూడాలన్నారు. అర్హులైన వారందరికీ శత శాతం  వాక్సినేషన్ పూర్తి కావాలన్నారు. ఈ

సమావేశంలో ఏపీఎస్ఐడిసి ఈఈ ప్రభాకర రావు,  వైద్యాధికారులు  పాల్గొన్నారు.

Comments