మండల, డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్, అధికారులను ఆదేశించారు.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలను,    ప్రభుత్వ సేవలను ప్రజలకు  సంతృప్త స్థాయిలో అందించడంలో  మండల, డివిజనల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీ  హరేందిర ప్రసాద్, అధికారులను ఆదేశించారు. 



బుధవారం ఉదయం   కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో  జరిగిన నెల్లూరు  డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి  వెంకట నారాయణమ్మ, నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీ కొండయ్య లతో కలసి, వివిధ శాఖల జిల్లా అధికారులు, నెల్లూరు డివిజన్ పరిధిలోని  మండల అధికారులతో సమావేశమై, సచివాలయంలో అమలు జరుగుతున్న సర్వీసెస్ పురోగతి,  స్పందన దరఖాస్తులు పరిష్కారం, పేదలందరికి ఇళ్ల   నిర్మాణాల పురోగతి, ఓటిఎస్ అమలు,  స్వచ్ఛ సంకల్పం, రీ సర్వే, జల్ జీవన్ మిషన్, ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల పురోగతి, జల కల, శానిటేషన్  అమలు మరియు శానిటేషన్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతి,  పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న పనుల పురోగతి, వాటర్ టాక్స్ కలెక్షన్స్, భూసేకరణ ప్రక్రియ తదితర అంశాలపై శాఖల వారిగా సమీక్షించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు  ప్రతి ఒక్కరూ నిబద్దతతో పని చేసి లక్ష్య సాధనకు    కృషి చేయాలన్నారు.   


ఈ సంధర్బంగా జాయింట్  కలెక్టర్ మాట్లాడుతూ, మండల, డివిజన్ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు  ప్రజలకు సంతృప్త స్థాయిలో కచ్చితంగా అందేలా కృషి చేయాలన్నారు. స్పందన పోర్టల్, మీసేవా, ఏపీ సేవ పోర్టల్ లో ప్రతిరోజు వచ్చే  సర్వీసు రిక్వెస్టులను పరిశీలించి సంబందిత రిపోర్టులు, పరిష్కార నివేదికలను నమోదు చేయాలన్నారు. ఈ విషయంలో మండల అధికారులు లక్ష్య సాధన కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణాల పురోగతిపై  జాయింట్ కలెక్టర్  సమీక్షిస్తూ,   డివిజన్ పరిధిలో చేపట్టిన  లే అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై మండలాల వారీగా  అడిగి తెలుసుకున్నారు.  రోజు  వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జాయింట్  కలెక్టర్, హౌసింగ్ అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి పునాది స్థాయికి తీసుకురావాలని అన్నారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో  పారిశుద్ధ్య కార్యక్రమ పనులను  పటిష్టంగా అమలు చేయాలని, డివిజన్ పరిధిలో చేపట్టిన శానిటేషన్ కాంప్లెక్స్ నిర్మాణాలను, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల భవన నిర్మాణాలను  నిర్దేశించిన గడువు లోగా  పూర్తి చేయాలని  జాయింట్ కలెక్టర్,  అధికారులను ఆదేశించారు. జగనన్న  సంపూర్ణ గృహ హక్కు పధకంనకు సంబందించి  ఓ.టి.ఎస్. ప్రక్రియ పురోగతి పై సమీక్షిస్తూ,   ఓటిఎస్ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోపు పూర్తిచేయాలని  జాయింట్ కలెక్టర్  శ్రీ హారెంధిరా ప్రసాద్, అధికారులను ఆదేశించారు. ఓ.టి.ఎస్ ప్రక్రియకు సంబందించి రిజిస్ట్రేషన్, స్కాన్నింగ్, డిజిటల్ సిగ్నేచర్ ప్రక్రియ వేగవంతం చేయాలని జాయింట్  కలెక్టర్, ఎం.పి.డి.ఓ లను ఆదేశించారు.  డివిజన్ పరిధిలో చేపట్టిన  భూముల సమగ్ర  రీ సర్వే పటిష్టంగా  వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్  కలెక్టర్, సర్వే అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన పనులు  త్వరగా పూర్తి చేయాలని జాయింట్  కలెక్టర్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి పంచాయతీ లో ఉపాధిహామీ పనులను గుర్తించి పని దినాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.


భూగర్భజలాలు పెంచడం ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో చెరువులను అభివృద్ది  చేసేందుకు కేంద్ర  ప్రభుత్వం అమృత్ సరోవర్ స్కీం ను ప్రవేశపెట్టిందని, ఈ పధకం కింద గుర్తించిన చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్, మండల అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా  అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్  కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలు కచ్చితంగా ప్రజలకు అందేలా చూడాలన్నారు. కోర్టు కేసులకు సంబందించి  అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో పాటు  కోర్టు ఆదేశాలు కచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. చుక్కల భూముల సమస్యపై మండల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ఈ నెల 22 వ తేది నాటికి మండల వారీగా చుక్కల భూముల సమస్యలకు సంబందించిన జాబితా సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్, తహశీల్దార్లను ఆదేశించారు.  డివిజన్ పరిధిలో వివిద ప్రాజెక్ట్స్ కు సంబందించి చేపట్టాల్సిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో జడ్పీ సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా, డి.ఆర్.డి.ఏ పి.డి లు శ్రీ తిరుపతయ్య, శ్రీ సాంబశివారెడ్డి,  ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ శ్రీ రంగ ప్రసాద్, పౌర సరపరాల శాఖ డి.ఎం. శ్రీమతి పద్మ, డి.ఎస్.ఓ శ్రీ వెంకటేశ్వర్లు, నెల్లూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, వివిధ శాఖల డివిజన్, మండల  అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Comments