లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముదస్తు చర్యలు చేపట్టాలన్నారు.

నెల్లూరు (ప్రజా అమరావతి);



అసని తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా వుండి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, అధికారులను ఆదేశించారు.


బుధవారం  కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫెరెన్స్ హల్లో అసని తుఫాన్ పట్ల  జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్ల పై మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తో కలసి  అధికారులతో సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.  ఈ సంధర్బంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ, అసని తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ    తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు,  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి  తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు  ఇవ్వడం జరిగిందన్నారు. అసని తుఫాన్ వలన జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిన నేపధ్యంలో అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,  అధికారులను ఆదేశించారు.   లోతట్టు ప్రాంత ప్రజలను  అప్రమత్తం  చేసిన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముదస్తు చర్యలు చేపట్టాలన్నారు.


  అవసరమైతే  ముంపు ప్రాంత ప్రజలను  సురక్షత ప్రాంతాలకు   తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. తుఫాను సమయంలో విద్యుత్ అంతరాయం వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా  పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అలాగే  విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంబందిత టెలి కమ్యూనికేషన్ ఆపరేటర్లను అప్రమత్తం చేసి  ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు  ప్రజలు త్రాగు నీటికి ఇబ్బంది పడకుండా తాగు నీటి పథకాల నుండి నీటి సరఫరా సమస్య లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.   తుఫాన్ ప్రభావం వలన రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా  ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి  శ్రీ గోవర్ధన్ రెడ్డి,  పంచాయతి, ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖల  అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ  సిబ్బంది  అప్రమత్తంగా వుంటూ  చెరువులకు గండ్లు పడకుండా   అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.  తుఫాన్ సమయంలో  మత్స్యకారులు  సముద్రం లోకి  చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,  అధికారులను ఆదేశించారు.  ప్రజలు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, అధికారులను ఆదేశించారు. 

 

తొలుత  జిల్లా కలెక్టర్ శ్రీ  కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అసని తుఫాను ప్రభావం వలన జిల్లాలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, ఏర్పాట్లు గురించి మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి గారికి వివరించారు. అసని  తుఫాన్ ను ఎదుర్కోవడానికి  జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.   జిల్లాలో గడిచిన 24 గంటల్లో  జిల్లాలో కావలి, కందుకూరు, ఉలవపాడు ల్లో  8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని,   వాతావరణ శాఖ అసని తుఫాన్  హెచ్చరిక నేపధ్యంలో  జిల్లాలో  ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు  తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై  గ్రామ స్థాయి నుండి, మండల, జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖల ఆధికారులకు స్పష్టమైన ఆదేశాలు, సూచనలు ఇవ్వడం జరిగిందని జిల్లా  కలెక్టర్,  మంత్రి గారికి వివరించారు. జిల్లా కేంద్రంలో  1077 నెంబర్ తో  తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.


ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్  శ్రీ హరెందిర ప్రసాద్, నెల్లూరు నగర  పాలక సంస్థ కమీషనర్  కుమారి జాహ్నవి, అడిషనల్ ఎస్.పి. లు శ్రీమతి వెంకటరత్నం, శ్రీ శ్రీనివాస రావు, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి  వెంకట నారాయణమ్మ,    ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్   ఎస్.ఈ శ్రీ విజయ కుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ శ్రీ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్.ఈ శ్రీ కృష్ణమోహన్,   డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి,  సి.పి.ఓ శ్రీ రాజు, డి.ఎస్.ఓ శ్రీ వెంకటేశ్వర్లు,వివిద శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Comments