యువతి యువకులు క్రీడల పట్ల. ఆసక్తి పెంచుకోవడం వల్ల వ్యక్తిత్వ వికాసం తోపాటు శారీరక దారుఢ్యం కూడా పెంచుకోవచ్చు

 


 రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


యువతి యువకులు క్రీడల పట్ల. ఆసక్తి పెంచుకోవడం వల్ల వ్యక్తిత్వ వికాసం తోపాటు శారీరక దారుఢ్యం కూడా పెంచుకోవచ్చు


నని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు.

 

బుధవారం కలెక్టర్ చాంబర్లో కరాటే కీడల్లో ప్రతిభ  సాధించిన విద్యార్థినీ విద్యార్థులను   జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అభినందించారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె మాధవిలత, మాట్లాడుతూ, ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహం అందించిన్నప్పుడే విజయాలు సాధ్యం అవుతాయన్నారు. కీడల్లో ప్రతిభ  సాధించిన విద్యార్థులకు, వారికి శిక్షణ ఇచ్చిన మాస్టర్లను   అభినందించారు. పట్టా పగలు సంతోష్ మెమోరియల్ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన  స్టేట్  కుంగుఫ్ కరాటే ఛాంపియన్ పోటీలలో  భాగంగా జిల్లాకు చెందిన  ధవళేశ్వరం,  రాజమహేంద్రవరం కి చెందిన విద్యార్థి, విద్యార్థినిలు పలు విభాగాల్లో ప్రతిభ  కనపరిచి విజేతలుగా నిలిచారు.  పోటీల్లో భాగంగా   సీనియర్ గ్రాండ్ చాంపియన్ షిప్ లో హిలి క్రాస్ స్కూల్  కి చెందిన  ఎన్. శ్రీ లక్ష్మి లత  ప్రధమ స్థానంతో  కప్పు ను కైవసం చేసుకోగా , ఉమెన్స్ కాలేజ్ కి చెందిన కే. లక్ష్మి భవాని, ద్వీతీయ స్థానంతో  సిల్వర్  మెడల్ ను  కైవసం చేసుకున్నారు. జడ్పిహెచ్ స్కూల్ కి చెందిన ఎన్ నాగేశ్వరి స్పెరింగ్ విభాగం లో స్లీవర్ మెడల్ సాధించగా,  బాయ్స్ కేటగిరి  లో జూనియర్ ఐటీఐ కాలేజ్ కీ చెందిన సిహెచ్ సాయి ప్రతాప్ రెండో స్థానం లో కప్పు ను, ధవిలేశ్వరంకు చెందిన జూనియర్ ఇంటర్ చదువుతున్న పిల్లి విజయ్  మూడో స్థానం లోను నిలిచి  మెమెంటోలను సాధించారు.


కలెక్టర్ ను నిర్వాహకులతో పాటు కలిసిన  శీక్షకులైన  (ట్రైనర్లు)  పిల్లి అరుణ్ కుమార్, మూర్తి, ఎస్. గౌతమ్ సీహెచ్. గణేష్ , నరేష్  లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.




Comments