వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తికేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, పియూష్‌గోయల్‌కు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ లేఖలు

వంటనూనెలకు కొరత నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి


అమరావతి (ప్రజా అమరావతి):

 కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ లేఖలు. 

 రష్యా  ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందన్న సీఎం.

 ఈనేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి.

 202122లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇందులో 40శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అయ్యిందని, మిగిలిన 60శాతం విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి చేసుకోవాల్సి వచ్చిందన్న సీఎం. 

 దిగుమతి చేసుకుంటున్న వంటనూనెల్లో 95 శాతం పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియాల నుంచి, 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామన్న సీఎం. 

 ఉక్రెయిన్, రష్యాల్లో పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని, ఈ ప్రభావం వినియోగదారులపై పడిందన్న సీఎం. 

 దీనివల్ల సన్‌ఫ్లవర్‌తోపాటు, ఇతర వంటనూనెల ధరలు పెరిగాయన్న సీఎం.

 రాష్ట్రంలో మూడింట రెండొంతులమంది సన్‌ఫ్లవర్‌నే వాడుతారని, దీనితర్వాత పామాయిల్‌ను 28శాతం మంది, వేరుశెనగనూనెను 4.3 శాతం మంది వాడుతారన్న సీఎం.

 మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించిన సీఎం. 

 విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలుకొలతలు శాఖలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుకూడా తీసుకున్నాయని వెల్లడించిన సీఎం.

 కొరతలేకుండా వంటనూనెలు సరఫరా చేయడానికి, రోజువారీగా ధరలు సమీక్షించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌కూడా ఏర్పాటు చేశామని తెలిపిన సీఎం. 

 తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీ చేసేవారితో క్రమం తప్పకుండా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపిన సీఎం. 

 ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా రైతు బజారల్లో సరసమైన ధరలకే విక్రయిస్తున్నాం. 

 ఇతర వంటనూనెల వినియోగంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపిన సీఎం. 

 ఆవాల నూనెకూడా సన్‌ఫ్లవర్‌ లానే ఉంటుందని,  కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందన్న సీఎం. 

 ప్రస్తుతం ముడి ఆవనూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందన్న సీఎం. 

 దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా ఉన్నాయని, వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాదికాలంపాటు ఆవనూనెపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న సీఎం. దీనిద్వారా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుగలుగుతామన్న సీఎం.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image