ఆధ్యాత్మిక భావన పెంచేందుకు, జిల్లా అభివృద్ధికి శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టఎంతగానో కృషి చేస్తోంది.
*: జిల్లా కలెక్టర్ పి.బసంత కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మే 27 (ప్రజా అమరావతి) :
*పుట్టపర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆధ్యాత్మిక భావన పెంచేందుకు మరియు జిల్లా అభివృద్ధికి
శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ పి.బసంత కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పుట్టపర్తి పట్టణంలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె.రత్నాకర్ తో జిల్లా అభివృద్ధి, పలు విస్తరణ పనులు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్ డి ఓ భాగ్య రేఖ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు బుక్కపట్నం, కొత్తచెరువు ప్రాంతాల్లో ఉన్నాయని, ఆయా ప్రభుత్వ భవనాలను పుట్టపర్తి పట్టణములోకి మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కొన్ని భవన సముదాయాలు అవసరం అవుతాయన్నారు. జిల్లా నూతన ఆసుపత్రి భవన నిర్మాణాల కొరకు స్థల సేకరణ, పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు, పుట్టపర్తి నగర పంచాయతీ నుండి పురపాలక సంఘముగా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకునిపోతున్నామని, అలాగే పుట్టపర్తి విమానాశ్రయం విస్తరించడానికి ప్రభుత్వానికి నివేదికలు అందజేయడం జరుగుతుందని శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్ట పలు అంశాలను జిల్లా కలెక్టర్ వివరించారు. పట్టణంలో ప్రభుత్వాసుపత్రి - ఆర్టీసీ బస్టాండ్ మధ్య 10 పడకలలు గలిగిన palliative కేర్ సెంటర్ 1500 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని
శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకొనిరాగా, వెంటనే మూడు నెలలలో అన్ని హంగులతో నిర్మించి అందజేయడం జరుగుతుందని శ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ .జె.రత్నాకర్ తెలిపారు. జిల్లా అభివృద్ధికి మరియు జిల్లాలో విస్తరణ పనులకు తాము అండగా ఉంటామనిశ్రీసత్యసాయి సెంట్రల్ మేనేజింగ్
ట్రస్టీ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ భాస్కర్ నారాయణ, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment