రైతు చల్లగా ఉంటేనే.. రాష్ట్రం సుభిక్షం !



*రైతు చల్లగా ఉంటేనే.. రాష్ట్రం సుభిక్షం !*



* *రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాష*


* *వరుసగా 4వ ఏడాది మొదటి విడత "వైఎస్ఆర్ రైతు భరోసా" సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి*


* *కమలాపురం నియోజకవర్గ కేంద్రంలో పండుగ వాతావరణంలో సాగిన "రైతుభరోసా" జిల్లా అధికారిక కార్యక్రమం*


* *జిల్లాలో 1,98,074 మంది రైతులకు గాను.. రూ. 108.95 కోట్ల 'రైతు భరోసా' సాయం జమ*


కడప, మే 16 : రైతు చల్లగా ఉంటేనే..

రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి.. అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. 


సోమవారం ఏలూరు జిల్లా గణపవరం మండలం లో బహిరంగ సభ నుండి "వైఎస్ఆర్ రైతు భరోసా-పిఎం కిసాన్ యోజన" 4వ ఏడాది మొదటి విడత ఆర్ధిక సాయం మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి.. రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి జిల్లా నుండి.. కమలాపురం నియోజకవర్గ కేంద్రంలోని.. ఎంపిడివో కార్యాలయ ప్రాంగణం నుండి.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తో పాటు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 


ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లతో కలిసి.. జిల్లాలో "రైతు భరోసా- పిఎం కిసాన్ యోజన" పథకం క్రింద వరుసగా 4వ ఏడాది మొదటి విడతగా..  1,98,074 మంది రైతులకు మంజూరయిన రూ.108,95,01,000 లు మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో రైతులకు అందజేశారు. 


** అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 4వ ఏడాది మొదటి విడత "వైఎస్సార్‌ రైతు భరోసా" సాయాన్ని అందించడం ద్వారా.. వ్యవసాయంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామ సీమలో రైతులు సాగుబడిని పండుగ వాతావరణంలో చేపడుతున్నారన్నారు. వాస్తవ సాగుదార్లందరికీ సాయం అందాలన్నది సర్కారు లక్ష్యం కాగా.. ఈ ఖరీఫ్ సీజన్ కు లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఈ ఏడాది.. ప్రకృతి కరుణించి అనుకున్న సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కూడా రానున్నాయని.. ఆ దిశగా ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం రైతులను సమాయత్తం చేస్తోందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాకుడా..  రైతులకు ఇచ్చిన మాట ప్రకారం.. రైతు భరోసా సాయాన్ని అందించారన్నారు. ప్రస్తుతం నిరాటంకంగా నాలుగవ ఏడాది కూడా... రైతు భరోసా సాయం అందివ్వడం సంతోషించదగ్గ విషయం అన్నారు. 


** అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ... రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఖరీఫ్ ఆరంబానికి ముందే.. రైతులకు సాగుబడి ఖర్చుల కోసం.. ఆర్థిక సాయం అందివ్వడం హర్శించదగ్గ విషయం అన్నారు. ఖరీఫ్ సీజన్ కోసం రైతులను సన్నద్ధం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి.. అన్ని జిల్లాల కలెక్టర్లను, ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్షిస్తూ ఒక నెల ముందే.. ప్రాజెక్టుల నుండి సాగునీటి వసతిని రైతులకు కల్పించాలని.. అదేశించడం జరిగిందన్నారు. అర్హత ఉండీ "వైఎస్ఆర్ రైతు భరోసా" పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే.. సంబందిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్బికెల్లో.. నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా.. కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. ఇంకా.. ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ : 155214 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 


** ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న గత ప్రభుత్వ తీరును మార్చేసి... వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే "రైతు భరోసా" సాయం పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకోచ్చారంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులపై ఉన్న అభిమానం, శ్రద్ధ ఎంతటిదో అర్థమవుతోందన్నారు. ప్రతి ఏడాది రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందిస్తోందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం మహా అద్భుతం అన్నారు. 


** సికే దిన్నె జెడ్పిటిసీ సభ్యులు పి.నరేన్ కుమార్ రెడ్డి.. రైతు బలంగా ఉండాలి. రైతు అన్ని విధాలా లాభపడాలనే సదుద్దేశంతో.. రాష్ట్ర.ప్రభుత్వం.. కృషిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. 50 లక్షల 10 వేల మంది రైతులకు.. రైతు భరోసా ఆర్థిక సాయం లబ్ది చేకూర్చడం జరుగుతోందన్నారు. జలయజ్ఞంలో భాగంగా.. జిల్లాలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటిమట్టంతో ఉన్నాయన్నారు. అన్నం పెట్టె అన్నదాత.. ఇచ్చేవాడుగానే వుండాలి తప్ప.. ఆర్జించే వాడుగా వుండకూడదనేదే.. రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. 


** ఆప్కాబ్ చైర్మన్, కడప డీసీసీ చైర్మన్ ఎం. ఝాన్షి రాణి.. మాట్లాడుతూ.. సహకార రంగంలో అతి తక్కువ వడ్డీతో రైతులకు రుణాలు అందించి రైతుల ఆర్థిక ప్రగతికి తోడ్పడతోందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన రైతులకు అందించే అన్ని రకాల పథకాలను, రాయితీలను సద్వినియోగించుకుని.. జిల్లా రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. రైతుల పిల్లల చదువులకు, విదేశీ విద్య కోసం ప్రత్యేక రుణ రాయితీలను రాష్ట్ర సహకార రంగం అందిస్తోందన్నారు. 


** ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ ఏ.మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం.. అనే తేడాలేకుండా.. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న ఘనత.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. మహిళలకు అత్యంత ప్రధాన్యతనిస్తూ.. అన్నిరకాల పథకాలకు మహిళలనే.. ప్రధాన లబ్ధిదారులుగా  చేశారన్నారు. అన్నదాతకు వెన్నుగా నిలిచిన ప్రభుత్వంగా దేశంలోనే గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రికి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.శివప్రసాద్ రెడ్డిలు, కడప నగర డిప్యూటీ.మేయర్ నిత్యానంద రెడ్డి, జిల్లా రైతు సలహా మండలి చైర్మన్.పి.శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్తేర్ రాణి, ఎపి మైన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరప్రతాప్ రెడ్డి, కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమరెడ్డి, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, కమలాపురం తహసీల్దార్ అమరేశ్వరి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వర రావు, ఉద్యానశాఖ డిడి వజ్రశ్రీ, ఏపీఎంఐపీ పీడి మధుసూధన రెడ్డి, డి.ఆర్.సి. ఏడీఏ నాగరాజు, మండల అధ్యక్షురాలు భారతి, ఎంపీపీవో శ్రీదేవి, స్థానిక వ్యవసాయశాఖ ఎడి అనుబంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు తదితరులు పాల్గొన్నారు. 


** *పలువురు రైతుల అభిప్రాయాలు..*


*1. జగనన్నను శతకోటి ధన్యవాదాలు...*


దివంగత ముఖ్యమంత్రి రాజన్న ఆశయాలకు అనుగుణంగా.. రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తున్న మా సీఎం జగనన్నను శతకోటి ధన్యవాదాలు. అడగకముందే.. అన్ని వర్గాల ప్రజల అవసరాలను గుర్తించి.. సంక్షేమ పథకాల ద్వారా సాయం చేస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర  అభివృద్ధికి మూలమైన అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న జగనన్న.. ఎప్పటికీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానే కొనసాగాలి. వరుసగా 4వ ఏడాదిలో కూడా.. రైతు భరోసా సాయాన్ని అందుకోవడం నా అదృష్టం.


- మారుజోళ్ళ మునిరెడ్డి, అప్పాయపల్లె, కమలాపురం మండలం


*2. జగనన్న పాలనలో రైతులకు స్వర్ణయుగం !*


ప్రభుత్వం అందిస్తున్న 4వ ఏడాది మొదటి విడత  రైతు భరోసాతో.. వ్యవసాయం పట్ల రైతన్నలకు మరింత ధీమాను ఇస్తోంది. జగనన్న పాలన రైతులకు నిజంగా స్వర్ణయుగం అని చెప్పావచ్చు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక.. 2012-13కు సంబంధించి రబీ శెనగ పంట ఇన్సూరెన్స్ తోపాటు.. 2018-19కు ఇన్ పుట్ సబ్సిడీ కూడా జిల్లా రైతులు అందుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పంట ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్ చార్జీలు కూడా ప్రభుత్వమే భరించింది. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు ఇంత సాయం చేయలేదు. 


- షేక్ అబ్దుల్ గనీ, కోగటం, కమలాపురం మండలం.


*3. సమాజంలో తలెత్తుకుని జీవిస్తున్నాం..*


జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో రైతులు తలెత్తుకుని జీవిస్తున్నారు. రైతే రాజు అన్న ధీమాతో.. ముందుకు సాగుతున్నాం. గత ఏడాదిలో రైతు భరోసా సాయంతో పాటు 2012-13 నాటి.. శెనగ ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా మా ఊరు రైతులు అందుకున్నారు. దేశమంతా కరోనా విళయ తాండవం చేస్తున్నా.. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ కొరత లేకుండా పాలిస్తున్న జగనన్న దేశానికే ఆదర్శ మూర్తిగా చెప్పవచ్చు.    


– డీవిసి మోహన్ రెడ్డి, హనుమాన్ గుత్తి, ఎర్రగుంట్ల.


*4. నష్టాల నుంచి బయటపడగలిగాం.*


ప్రభుత్వం అమలు చేస్తున్న "వైఎస్సార్‌ రైతు భరోసా" సాయాన్ని వరుసగా 4వ ఏడాది కూడా అందుకోవడం సంతోజంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఏ కొరత ఉండదు. ఇచ్చిన హామీలకంటే అదనంగా రైతులకు సాయం చేస్తుండటంతో.. రైతు లోకమంతా జగనన్నకు జై కొడుతోంది. జగనన్న ప్రభుత్వం వచ్చాక రైతులు దళారీ వ్యవస్థ నుండి నష్టపోకుండా బయట పడగలిగారు.  


- ఎస్.వి.శశిధర్ రెడ్డి, బయనపల్లె, కమలాపురం మండలం.


*5. రైతుల ఆత్మగౌరవం పెరిగింది...*


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఏర్పడిన నాటినుండి రైతుల ఆత్మగౌరవం పెరిగింది. రైతులకు అవసరమైన అన్నీ సేవలను గ్రామాల్లోనే రైతుల ముంగిళ్ళలోకి తీసుకొచ్చారు. రైతు సంక్షేమ ప్రభుత్వంలో ప్రకృతి కూడా.. అనుకూలంగా కరుణిస్తోంది. రాజన్న కలలు కన్న రామరాజ్యం.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కనిపిస్తోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాలు ఉండాలి. రైతు కుటుంబంలో పుట్టినందుకు, ఈ రాష్టంలో ఉన్నందుకు గర్వపడుతున్నా.


- జి.వి.భాస్కర్ రెడ్డి, వి.ఎన్. పల్లె మండలం.



Comments