రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, బసంత కుమార్

 రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్,   బసంత కుమార్


ధర్మవరం, మే 28 (ప్రజా అమరావతి) :-*


*బాలికల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని జిల్లా కలెక్టర్   బసంతకుమార్ పేర్కొన్నారు.*


*శనివారం  ధర్మవరం  ఆర్డీవో కార్యాలయంలో సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమం అనంతరం  ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో  రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని రుతుక్రమం సమయంలో వాడే ఉత్పత్తులు, వాటిని పారవేసే పద్ధతిపై జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్  యునిసెఫ్ రూపొందించిన పోస్టర్ లను ఆవిష్కరించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ.... బాలికలు  కౌమారదశలో చేరిన సమయంలో శారీరకంగా వారిలో కలిగే మార్పుల అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, వారికి ఆ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలోని బాలికలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ఐసిడిఎస్  అధికారులనుజిల్లా కలెక్టర్ ఆదేశించారు.* ఈ కార్యక్రమంలో ఆర్డీవో వరప్రసాద్ మున్సిపల్ కమిషనర్  మల్లికార్జున. మీసేవ తాసిల్దార్  అనుపమ , ఐసిడిఎస్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు


Comments