కొవ్వూరు, (ప్రజా అమరావతి);
ధర్మవరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ పై మంత్రి ఆగ్రహం
గ్రామ స్థాయిలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి
మంత్రి తానేటి వనిత
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల తో పాటు గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆదేశించారు.
సోమవారం కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో మంత్రి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత అక్కడ ఉన్న గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ కార్యదర్శులు ముఖ్యంగా ఏమినీటిస్ కార్యదర్శి, సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వాహకులు , పంచాయతీ సిబ్బంది విధిగా గ్రామ స్థాయిలో సమన్వయం తో పనిచేయాలని తెలిపారు.
పి ఎ సి ఛైర్మన్ ఎమ్. కాశీవిశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు స్థానిక నాయకులు ఉన్నారు.
addComments
Post a Comment