బిల్లులు రావని కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

      

ఉపాధిహామీ పధకంలో 1900 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు

యుద్ధ ప్రాతిపదికన ఉపాధిహామీ పనులు చేపట్టడం జరుగుతుంది 

పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకు 1072 కోట్ల రూ.లకు పరిపాలనామోదం

పియంజెఎస్ వై చేసిన పనులకు 83 కోట్ల రూ.లు మంజూరుకు చర్యలు

ఆర్డబ్ల్యుఎస్ లో చేసిన పనులకు 800 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు మంజూరు

నీటిఎద్దడి గల గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా మంచినీటి సరఫరా

బిల్లులు రావని కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


ఇకపై క్లాప్ మిత్రలుగా స్వచ్ఛ సంకల్పంలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లు

      రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు

అమరావతి,2 మే (ప్రజా అమరావతి):రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారని అన్నారు.ఈసందర్భంగా పంచాయితీరాజ్ శాఖలో వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని,ఉపాధిహామీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సియం ఆదేశించారని చెప్పారు.ఉపాధిహామీ పధకంలో చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల బిల్లులను వెంటేనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సియం ఆదేశించారన్నారు.అదే విధంగా మెటీరియల్ కాంపొనెంట్ తో నిర్వహించే రైతు భరోసా కేంద్రాలు,గ్రామ సచివాలయాల భవనాలు,వెల్నెస్ కేంద్రాలు,బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు సహా వివిధ భవన నిర్మాణాలకు ఎక్కడా సిమ్మెంట్ కొరత లేకుండా చూడాలని సియం ఆదేశించారని ముత్యాల నాయుడు వివరించారు.నిరంతర సిమ్మెంట్ సరఫరాకై ఆయా కంపెనీలతో సంప్రదించేందుకు వీలుగా ఒక లైజన్ అధికారిని నియమించాలని సియం ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 9వేల కి.మీల పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకుగాను 1073 కోట్ల రూ.లు విడుదల చేసేందుకు వెంటనే అవసరమైన పరిపాలనామోదాన్నిఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ఇందుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించి పనులను కూడా మొదలు పెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.పనుల నాణ్యత విషంయలో ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.ఎక్కడైనా పనుల నిర్వహణలో నాణ్యత లోపించినట్టు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన 83కోట్ల రూ.ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సియం ఆదేశించారని ఆబిల్లులను కూడా వెంటనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పధకంలో చేసిన పనులకు సంబంధించిన 800 కోట్ల రూ.లు బకాయిలను కూడా వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నీటి ఎద్దడి గల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతోందని తెలిపారు.అదే విధంగా జగనన్న కాలనీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ముత్యాల నాయుడు చెప్పారు.

వైయస్ఆర్ జలకళ కార్యక్రమం కింద ఉచితంగా బోరు తవ్వించడం,విద్యుత్ కనక్షన్, పైపు వేయడం తోపాటు దూరంగా ఉన్న పొలాల్లో బోరువేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 2లక్షల రూ.లు వరకూ ప్రభుత్వమే భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మీడియాకు వివరించారు.వైయస్సార్ చేయూత కార్యక్రమాన్నివిజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ రెండేసి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు చెప్పారు.ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించి దానిని సెగ్రిగేషన్ పాయింటుకు రవాణా చేసేందుకు వీలుగా ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ను అందించనున్నట్టు ఆయన తెలిపారు.స్వచ్ఛ సంకల్పం పధకంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గ్రీన్ అంబాసిడర్లుగా పిలవబడుతున్నవారిని ఇకమీదట క్లాప్ మిత్రలుగా పిలవాలని నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు.వారికి చెల్లించాల్సిన మూడు నెలల జీతాల బకాయిలను కూడా వెంటనే చెల్లించడంతో పాటు ఇకమీదట వారికి నెలనెలా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వెల్లడించారు.

ఈసమావేశంలో నర్సీపట్నం ఎంఎల్ఏ పి.ఉమాశంకర్ గణేశ్ కూడా పాల్గొన్నారు.

    

Popular posts
Gudivada - Kankipadu road widening, development works start
Image
నైపుణ్యాల‌కు ప‌దును పెట్టండి... విజేత‌లుగా నిల‌వండి
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
ఆస్తినష్టం, పంట నష్టం అంచనాల తయారీలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Image
రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం
Image