ఒక అద్భుతమైన చారిత్రక సన్నివేశం ఆవిష్కృతం కానుంది


అమరావతి (ప్రజా అమరావతి);


*కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.*


*గుమ్మటం తండ వద్ద నున్న ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (గ్రీన్‌కో) ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి.*


*అనంతరం వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ (గ్రీన్‌కో) ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*


ఒక అద్భుతమైన చారిత్రక సన్నివేశం ఆవిష్కృతం కానుంది


. మనందరం ఈ ఆనందాన్ని పంచుకోవాల్సిన సమయం. ఈ సందర్భంగా సహచర మంత్రులకు, పార్లమెంటు, శాసససభ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు, గ్రీన్‌ కో గ్రూపు ఎండీ శ్రీ అనిల్‌ ఇతర ప్రతినిధులకు శుభాకాంక్షలు.


కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్దదైన సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రొజెక్టు (వరల్డ్‌ లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రొజెక్టు) ఏర్పాటుకు ముందుకొచ్చిన గ్రీన్‌కో గ్రూపుకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. 5230 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న  దీర్ఘకాలిక శక్తి నిల్వ ప్రాజెక్టు... తక్కువ ధరకే, స్ధిరమైన, అనువైన, ఇరవైనాలుగు గంటలపాటు నిరంతర క్లీన్‌ విద్యుత్‌ను అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో మరో విశేషమేమిటంటే... నిరంతరం క్లీన్‌ ఎనర్జీని అందిస్తుంది. ఈ ప్రొజెక్టు పంప్డ్‌ స్టోరేజ్, పవన, సౌర విద్యుత్‌ల సముదాయం. డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో (నాన్‌ పీక్‌ అవర్స్‌లో) సోలార్, విండ్‌ పవర్‌ను ఉపయోగించుకుని నీటిని రిజర్వాయర్‌లోకి పంప్‌ చేయడం ద్వారా మరలా నీటిని డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో (పీక్‌అవర్స్‌లో) వినియోగించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఈ ప్రాజెక్టులో ఉంది. తద్వారా రోజంతా పునరుత్పాదక శక్తి ఉత్తత్పి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. రాష్ట్రంలో ఇవాళ మనం చేపడుతున్న ఈ ఇంథన పునరుత్పాదక ప్రక్రియ, భవిష్యత్తులో యావత్ దేశానికి మార్గదర్శకం కానుంది. 


ఇక్కడ ఏర్పాటు అవుతున్న ఈ ప్రాజెక్టు.. రానున్న రోజుల్లో మొత్తం దేశంలోనే, ఈ ప్రక్రియకు నాందిగా నిలవనుంది. విద్యుత్ ఉత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా మారిపోయి, పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో నిలవనుంది. 


1680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ సామర్ధ్యం, 3 వేల మెగావాట్ల సౌరశక్తి, 550 మెగావాట్ల పవన విద్యుత్ మొత్తం వీటన్నింటినీ 3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తుండగా... ఇక్కడ ఏకంగా 5230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.

అంతే కాకుండా   కాలుష్య రహితం, పర్యావరణ సమతుల్యత ఇక్కడ చాలా కీలకం. మనం గ్రీన్ హైడ్రోజన్‌, గ్రీన్ అమ్మోనియా గురించి మాట్లాడుకుంటున్నాం. మిట్టల్ కంపెనీ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతోంది. ఆ సంస్థ ఇక్కడ 250 మెగావాట్ల విద్యుత్‌తో 1000 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా నిర్దేశించుకున్న ప్రాంతాలకు (ఇతర రాష్ట్రాలు)  ఏ లోటు లేకుండా కచ్చితంగా 250 మెగావాట్ల విద్యుత్‌ను ఇక్కడి నుంచి సరఫరా చేస్తారు. రానున్న రోజుల్లో ఇది ఒక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. 

ఈ నేపధ్యంలో గ్రీన్ పవర్‌ (పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి) ఉత్పాదన రంగంలో ఆసక్తి ఉన్న సంస్ధలకు ఆంధ్రప్రదేశ్‌... దేశంలో లేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా అందుకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇందు కోసం ఉన్న సానుకూల వాతావరణం, సదుపాయాల వల్ల ఇక్కడ 33 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. గ్రీన్ పవర్‌ ఎలా ఉత్పత్తి చేయవచ్చు అన్న విషయాన్ని ఈ ప్రాజెక్టు ఇప్పుడు యావత్ దేశానికి చూపుతోంది. 


ఈ  ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు ఇది సాధ్యమవుతుందని ప్రపంచానికి తెలిపిన గ్రీన్‌కో ఎండీ అనిల్‌, సంస్ధ బృందానికి అభినందనలు. మీకు ఏ రకమైన సహాయ, సహకారాలు కావాలన్నా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని గుర్తుంచుకొండి, మీ అందరికీ మరొక్కసారి మంచి జరగాలని కోరుకుంటున్నాను,  అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


ఈ కార్యక్రమంలోవిద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌,  గ్రీన్‌కో కంపెనీ ప్రతినిధులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments