రాజమహేంద్రవరం మే 25 (ప్రజా అమరావతి);
•తూర్పుగోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని సందర్శించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి* .
•పూర్తి సమన్వయంతో పనిచేస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిష్టను పెంచండి
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలకంగా వ్యవహరించాల్సివుంటుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సమాచార శాఖ కమీషనరు టి. విజయ్ కుమార్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్బంగా ఆయన సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సంతృప్తి స్ధాయిలో అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనే ఏకైక లక్ష్యంతో గడచిన మూడు సంవత్సరాల నుంచి పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఆ సంక్షేమ ఫలాల లబ్ధిని ప్రజలకు చేరువ చేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బందిపై గురుతర బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలు ప్రజలకు అందినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా ప్రభుత్వ సేవలు మరింత ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశింపబడిన గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ, వార్డు సచివాలయ నూతన వ్యవస్థ ఆవిర్భవించిందని ,ఈ వ్యవస్ధలు గురించి వాటి ద్వారా అందించే సేవలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి గురించి ప్రజలుకు మరింత విస్త్రృతంగా అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి చేకూర్చడం లో ఇంకా ఏమైనా లోటుపాట్లు, సూచనలు ఉంటే వాటికి సంబంధించిన ప్రజాభిప్రాయ నివేదికలు కూడా పంపవలసిన ప్రధాన బాధ్యత సమాచార పౌర సంబంధాల శాఖ సిబ్బంది పై ఉందన్నారు. దీనివలన ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ,దిద్దుబాటు చేసుకుని ఆయా పథకాలకు మరల దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందేందుకు అవకాశం ఉందన్నారు. మీడియాతో సత్సంబంధాలు పెంచుకుంటూ వారిని సమన్వయం చేసుకుంటూ మరింత సమర్ధవంతంగా పనిచేస్తూ శాఖ కు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. మన వృత్తిని సరైన ఫందాలో నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తే ప్రజలకు చాలామేలు చేసిన వారమౌతామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ విశిష్టతను పెంచేందుకు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు రోజు రోజుకు కొత్తగా పెరుగుతున్న డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వంటివి దృష్టిలో ఉంచుకుని మారుతున్న ఆధునిక సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ పరిపాలన సౌలభ్యం కొరకు చేపట్టిన జిల్లాల పునర్విభజన నేపధ్యంలో సమాచార శాఖను కూడా బలోపేతం చేసేందుకు శాఖలో ఇప్పటివరకు విడి విడిగా ఉన్న ప్రచార విభాగం , ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగుకిందకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే మరింతగా మంచి ఫలితాలు సాధించ వచ్చునన్నారు. అక్రిడిటేషన్ల మంజూరులో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తూ అర్హులైన అందరి పాత్రికేయులకు తప్పనిసరిగా అక్రిడిటేషన్లు కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. తొలుత సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి వారికి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి జ్ఞాపికను బహూకరించారు
ఈ సమావేశంలో అదనపు సంచాలకులు ఎల్. స్వర్ణలత, ఉపసంచాలకులు పి. తిమ్మప్ప, బి పూర్ణచందర్రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి , ఐ కాశయ్య , సహాయ ఇంజనీర్ శ్రీనివాసరావు, డివిజనల్ పిఆర్వో వి వి రామిరెడ్డి, ఆడియో విజువల్ సూపర్వైజర్ జి ధర్మరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment