విజయవంతమైన మూడేళ్ళ పాలనను పూర్తి చేసుకుని, నాలుగో ఏట అడుగిడుతున్న ప్రజా సంక్షేమ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరుకున్న సమాచార శాఖ మంత్రి
తిరుమల, మే 30 (ప్రజా అమరావతి): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా
3 సం. ప్రజా సంక్షేమ పాలన పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారు తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని స్వామి వారు, అమ్మవార్ల దీవెనలతో మరింతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరిగేలా చూడాలని కోరుకున్నారు.
మిగిలిన రెండేళ్ళు తోడుగా వుండి, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం అందించాలని దేవతామూర్తులను ఆయన కోరుకున్నారు..
addComments
Post a Comment