రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చూడాలి..
తోపుడు బళ్ల వ్యాపారులకు నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవాలి
- కమిషనర్ దినేష్ కుమార్..
తోపుడు బళ్ల వర్తకులు నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా వారికి నిర్దేశించిన ప్రాంతం లో వ్యాపారం చేసుకుని కార్పొరేషన్ అధికారులకు సహక రించాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక 32 వ వార్డు, జాంపేట మార్కెట్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ ఆకస్మికం గా పర్యటించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునే వారు ప్రజలకు అసౌకర్యం కల్పించ కుండా వారి వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మాంస విక్రయ వ్యాపారులు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలని, మాంసం పై ఈగలు ముసురుకోకుండా వలలను కప్పి ఉంచాలన్నారు. అలాగే మాంస వ్యర్ధాలు ప్రత్యేకంగా డస్ట్ బిన్ లలో వేసి, చెత్త సేకరణ సిబ్బందికి అందించాలన్నారు. వర్షాలు కురిసినపుడు ఇటువంటి ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందన్నారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారం చేసుకునే వారు కూడా రోడ్లపై, రైల్వే ట్రాక్, బ్రిడ్జి మీదుగా పాడైన వాటిని పారవెయ్యకుండ పారిశుధ్య కార్మికులు వచ్చినప్పుడు వాటిని అందచేసి నగర పరిశుభ్రతకు సహకారం ఇవ్వాలని కోరారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసి, నగర అభివృద్ధికి వాటిని వినియోగిస్తామన్నారు. ఈ నగరం మనందరిది అని, ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని దినేష్ కుమార్ వివరించారు.
డ్రైన్ లలో సిల్ట్ తొలగించే ప్రక్రియ వేగవంతం చేయాలని, సిల్ట్ తో డ్రైన్ లు పూడుకుపోయి లోతట్టు ప్రాంతాల్లోకి మురుగు నీరు చేరకుండా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాక మునుపే సిల్ట్ తొలగింపు ప్రక్రియ పూర్తి అవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
డిప్యూటీ కమిషనర్ సాంబశివరావు, ఎమ్ హెచ్ ఓ వినూత్న,సిటీ ప్లానర్ సూరజ్ కుమార్,ఎస్.ఈ పాండు రంగారావు తదితరులు కమిషనర్ వెంట పాల్గొన్నారు
addComments
Post a Comment