రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన ముకేష్ కుమార్ మీనా
అమరావతి, మే 19 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గురు వారం మద్యాహ్నం 12.06 గంటలకు కె.విజయానంద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తదుపరి ముకేష్ కుమార్ మీనాను కె.విజయానంద్ దుశ్శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బందిని ముకేష్ కుమార్ మీనాకు పరిచయం చేశారు.
addComments
Post a Comment