రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మే 9న కొవ్వూరు నియోజక వర్గంలో స్పందన కార్యక్రమం రద్దు
యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన
.... కలెక్టర్ డా కే.మాధవీలత
వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో సోమవారం (మే 9) కొవ్వూరు నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమం రద్దు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు వలన జిల్లా అధికారులు ప్రధాన కార్యస్థానం లో అందుబాటులో ఉండవలసి ఉన్నందున రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తదుపరి నియోజక వర్గం లో స్పందన కార్యక్రమం నిర్వహించే తేదీని తెలియ పరుస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.
ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు.
రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో స్పందన ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు
addComments
Post a Comment