బసవేశ్వరుని జీవితం ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం : జిల్లా కలెక్టర్
తిరుపతి మే03 (ప్రజా అమరావతి): భారత దేశంలో కుల వివక్షత,వర్ణ, వర్గ విభేదాలు లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది శ్రీ బసవేశ్వర మహర్షి అని జిల్లా కలెక్టర్ కే. వెంకటరమణ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ బసవేశ్వర మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బసవేశ్వర మహర్షి ని స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. బసవ జయంతిని ఈ ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా ప్రకటించిందన్నారు. ఈ జయంతి వేడుకను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఆయన చెప్పిన వాక్కులు.. నేటి సమాజానికి ఆదర్శనీయం అన్నారు. హైందవ మతాన్ని సంస్కరించి సమాజంలో అందరూ సమానమేనని సత్యాన్ని ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పిన సంఘ సంస్కర్త అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి బాల కొండయ్య, సెట్వన్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment