గుంటూరు (ప్రజా అమరావతి)!
ఎన్టిఆర్ స్పూర్తితో మహానాడు వేదికగా యువరక్తంతో తెలుగుయువత తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి సమరోత్సహంతో ముందుకు సాగాలని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహానాడు సన్నాహంగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుయువత కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గాల తెలుగుయువత అధ్యక్షులతో ముఖ్య అతిదులుగా గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, గుంటూరు పశ్చిమ టిడిపి ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని) గారు, అర్బన్ టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ గారు, పార్టీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య గారు, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా (బాబు), టిడిపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఘని లతో కలిసి తెలుగుయువత కమిటి సమావేశం నిర్వహించారు. అనంతరం కమిటి సభ్యులకు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారి చేతులమీదగా పార్టీ కొత్త సభ్యత్వం అందజేశారు.
*గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ*
ప్రజాపక్ష పోరులో యువతరం నడుంబిగించి ముందుకు సాగుతూ పార్టీ పట్ల యువత విద్యార్థులను ఆకర్షించే దిశగా పోరాటాలకు శ్రీకారం చుట్టాల
ని యువత తల్చుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదని జాబులిస్తామని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని ఆశ చూపి ఏవిధంగా ప్రభుత్వం మోసగించిందో యువతకు సవివరంగా తెలియజేస్తూ స్వామి వివేకానందాను ఆదర్శంగా యువత సన్మార్గంలో ఆదర్శ రాజకీయాలకు బాటలు వేయాలని కోరారు. ఎన్.టి.ఆర్ స్పూర్తితో మహానాడు వేదికగా యువరక్తంతో తెలుగుయువత తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి సమరోత్సహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా జిల్లా తెలుగుయువత కమిటి సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే
ఐ టిడిపి సేవలను వినియోగించుకోవాలని తెలియజేసారు.
*గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ*
పార్టీ సభ్యత్వం తీసుకున్న తెలుగు యువత కమిటీ సభ్యులకు కార్డులు తయారుచేసి పంపిణి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సభ్యత్వ నమోదులో తెలుగు యువత చురుకైన పాత్రతో సత్తా చాటాలని మహానాడును జయప్రదం చేసేందుకు క్రింది స్థాయి కార్యకర్త నుండి ముఖ్య నాయకుల వరకు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం భయపడే విధంగా భారీ స్థాయిలో జయప్రదం చేయాలనీ ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకే సొంతమన్నారు.
*గుంటూరు అర్బన్ టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్ మాట్లాడుతూ*
మహానాడుకు గుంటూరు అర్బన్ పరిధిలోని ప్రతి వార్డు నుండి ఎన్ని అవాంతరాలు ఎదురైనా స్వచ్చందంగా తరలివెళ్లి గుంటూరు తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని ఎక్కడికక్కడ వార్డు స్థాయి నుండి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలి వెళ్లాలని కోరారు.
*తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ*
మహానాడుకు జిల్లానుండి 100 మంది స్వచ్చందంగా తరలి వెళ్తున్నామని రాబోవు రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పైన ప్రజలను ఆలోచింపజేసేవిధంగా రాజీలేని పోరాటానికి తెలుగుయువత శ్రీకారం చుట్టి తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావటానికి తమవంతుగా ప్రధాన పాత్ర పోషిస్తామని నూతనోత్సాహంతో సమరశంఖం పురిస్తామని అన్నారు.
*తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ*
గతంలో ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగితే రావాలి జగన్ కావాలి జగన్ అని ఓట్లేసిన ప్రజలు ఈరోజు పోవాలి జగన్ దిగిపోవాలి జగన్ అని ఎదురు చూస్తున్నారన్నారు. ఏవిధంగా అయితే యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసారో దానిని నిరుద్యోగ లోకం జీర్ణించుకోలేకపోతుందని... తిరిగి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ప్రచార కార్యదర్శి నాయుడు ఓంకార్, తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా (బాబు), ఉపాధ్యక్షులు కొల్లిమర్ల రాము, చాగంటి సత్యహర్ష, కొండెపు శేఖర్ బాబు, కన్నసాని బాజీ, అధికార ప్రతినిధులు ముంగమూరి హైమారావు, సింగు గోపి కృష్ణ,సింగంశెట్టి శివకుమార్, షేక్ షుకూర్, సీఫ్ మహమ్మద్, తప్పెట్ల ప్రేమ్ చంద్, ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు, కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నెం శ్రీనివాసరావు, షేక్ ఖాసీం, కార్యదర్శులు బొక్కా లక్ష్మణ్, మాచవరపు దాసు, ఈదర త్రినాధ్, పఠాన్ హఠావుల్లాఖాన్, గ్యాలం హనుమంతరావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మువ్వా కృష్ణ సాయి, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నాగిశెట్టి నాగరాజు, మండల అధ్యక్షులు మానుకొండ బ్రహ్మాజీ, యదాలా గణేష్, గుంటూరు పశ్చిమ ప్రధాన కార్యదర్శి ఉంగుటూరు ధర్మారావు, తూర్పు ప్రధాన కార్యదర్శి మస్తాన్ రావు, గాలి శ్రీనివాస్ గౌడ్, పొందూరి బాలాజీ, మాజీ జడ్పిటిసి పాములపాటి శివన్నారాయణ, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్లిపెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment