రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
జిల్లాలోని ఆసుపత్రులలో శానిటేషన్, భద్రత , ఫైర్ సేఫ్టీ , కోవిడ్ పెండింగ్ బిల్లుల వివరాలతో కూడిన నివేదిక, తగిన ప్రతిపాదనలతో సమర్పించాల
ని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత స్పష్టం చేశారు.
గురువారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితరులు అమరావతి నుండి నిర్వహించిన జూమ్ మాధ్యమ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. మాధవీలత ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. అందుకనుగణంగా జిల్లాలో ఆసుపత్రులలో మెరుగైన పరిస్థితి కల్పించే బాధ్యత వైద్యాధికారులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఆసుపత్రులలో అంబులెన్స్ నిర్వహణ, అవసరమైన అత్యవసర మందులు, శానిటేషన్ మౌలిక సదుపాయాలు, శానిటేషన్ సిబ్బంది, పేస్ట్ కంట్రోల్ నిర్వహణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్, సి.హెచ్.సి. పరిధిలో నియామకాలు చేపట్టవలసి పోస్టుల కేటగిరీ వారీగా నివేదిక ఇవ్వాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ కి అవసరమైన మూడు టెక్నిషియన్ పోస్టు ల భర్తీ, ఆరోగ్యశ్రీ విభాగంలో నాలుగు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ల భర్తీ, టెక్నికల్, నర్సు, పారామెడికల్, శానిటరీ, 4 వ తరగతి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు
ఆసుపత్రులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సిబ్బంది పనితీరుపై ప్రత్యక్ష పర్యవక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. తన ఆసుపత్రుల తనిఖీల్లో వాహనాలు నిర్వహణ, మహా ప్రస్థానం, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ లపై ముఖ్య కార్యదర్శి సమీక్షించారు.
మృత దేహాల తరలింపు , పోస్టు మార్టం సంబంధించి డ్రైవర్స్, డాక్టర్స్, సిబ్బంది బాధిత కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి పెట్టడంజరిగిందన్నారు. ఆసుపత్రులకు సంబంధించిన వ్యతిరేక వార్తలు వస్తున్నాయి, వాటిపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్య కార్యదర్శి సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ విభాగాల అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర సిబ్బంది తో విడివిడిగా సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సిబ్బంది కి జీతాలు చెల్లింపుల్లో ఆరోణలున్నాయని, కాంట్రాక్టర్ లు సిబ్బంది బ్యాంకు ఖాతాలకు జమచేసే మొత్తాలను ఆడిట్ చేసి, నివేదిక అందజేయ్యాలని డా. మాధవీలత స్పష్టం చేశారు. ఫైర్ ఆడిట్, ఆసుపత్రులు నిర్వహణ, సెక్యూరిటీ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ని ఇచ్చి నిరంతర పర్యవేక్షణ చేపట్టల్సి ఉందన్నారు.
ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో కలెక్టరు పాటు డి.ఎం.హెచ్. ఓ. డా. ఆర్. స్వర్ణలత, డి సి హెచ్ ఎస్ డా. సనత్ కుమారి పాల్గొన్నారు.
addComments
Post a Comment