తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారుడి జీవనోపాధి అంటే వలసల మీద ఆధారపడి జీవించడం

 

మురమళ్ళ, కోనసీమ జిల్లా (ప్రజా అమరావతి);


*వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు*


*డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మత్స్యశాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, మత్సా్యకారుల పట్ల ప్రేమ చూపిస్తున్న గొప్ప నాయకుడు మన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. అన్నా గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, ఇప్పటివరకూ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారుడి జీవనోపాధి అంటే వలసల మీద ఆధారపడి జీవించడంఅనాదిగా వస్తుంది. మీరు పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు, ఏం చేస్తే వీరి జీవితాలు బాగుపడతాయని ధీర్ఘకాల ప్రణాళికలు రచించి, చెప్పిన మాట ప్రకారం ప్రతీ కార్యక్రమాన్ని కూడా సమయానికి చేస్తున్న ఏకైక సీఎం మీరు. దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు ఇచ్చినట్లుగా వేట నిషేద పరిహరం రూ. 10 వేలు ఇవ్వడం లేదు. తమిళనాడులో కుటుంబానికి రూ. 5 వేలు, ఒడిశాలో రూ. 4,500, పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్‌ బ్యాన్‌ రిలిఫ్‌ పరిహారం ఇప్పటికీ ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో రూ. 4,500, కేరళ కూడా రూ. 4,500, పాండిచ్చేరి రూ. 5,500 ఒక కుటుంబానికి ఇస్తున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మీరు ఇస్తున్నారు. ఇటీవల కేంద్ర మత్స్యశాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏపీ చేస్తున్న కార్యక్రమాలు చెప్పినప్పుడు వారంతా హర్షద్వానాల మధ్య సీఎంగారికి కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఇస్తున్న ఈ మత్స్యకార భరోసా వారికి భరోసానిస్తుంది. అంతేకాక ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ కారణంగా ఇస్తున్న పరిహారం దేశంలో ఏ ప్రభుత్వం ఇంత చొరవ చూపలేదు. అనేక ప్రభుత్వాలు హమీలిచ్చి చేతులు దులుపుకుంటాయి కానీ ప్రత్యేక చొరవ తీసుకోరు. మీరు మాత్రం మత్స్యకారులకు ఎన్నో చేస్తున్నారు. ఇప్పటివరకు మనకున్నవి రెండే రెండు ఫంక్షనల్‌ హర్బర్స్‌ ఉంటే అవి విశాఖ, కాకినాడ మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో హర్బర్‌ ఉండాలని 9 హర్బర్‌లు మంజూరు చేసిన ఘనత మీది. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ వద్ద ఇప్పటికే నిర్మాణాలు మొదలయ్యాయి, ఇవికాక మరో ఐదు హర్బర్‌లు ఏర్పాటుచేస్తున్నారు, ఇవికాక మరో 4 ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే తీరప్రాంతంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత మీది. ఇవి కాక ఆక్వారంగానికి సంబంధించి పవర్‌ సబ్సిడీ క్రింద యూనిట్‌ రూపాయిన్నరకి ఇవ్వడం, కోవిడ్‌ సమయంలో ప్రత్యేక చొరవ వల్ల నష్టాలు రాకుండా లాభాలు చూసిన రంగం ఆక్వారంగం. లక్షలాది మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపిన మీరు వారి చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతారని సాటి మత్స్యకారుడిగా సగర్వంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.


*దుర్గా భవాని, బైరవపాలెం, మత్స్యకార మహిళ*


అందరికీ నమస్కారం, మాకు చాలా సంతోషంగా ఉంది, మేం వేటకు వెళితేనే రెండుపూటలా తింటాం, వేటకు వెళ్ళకపోతే పస్తులుండే పరిస్ధితి. కానీ మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేం ఏ రోజు కూడా పస్తులు లేమని గర్వంగా చెప్పుకుంటాను. మాకు మీరు నేనున్నాను అని భరోసానిచ్చి మాకు రూ. 10 వేలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా మీకు రుణపడి ఉంటాం. మేం సముద్రంలో వేటకు వెళితేనే బతుకుతాం, కానీ ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ వల్ల మాకు జీవనోపాధి తగ్గింది, దానివల్ల పిల్లలకు మంచి పౌష్టికాహారం కూడా ఇవ్వలేకపోతున్నాం. కానీ మీరు మా కష్టాన్ని గుర్తించి నెలకు నష్టపరిహారం రూ.  11,500 చొప్పున ఇవ్వడం చాలా సంతోషం. మాకు మొదటివిడతగా నాలుగు నెలలకు రూ. 46,000 అందుకుంటున్నాను. మేం జన్మజన్మలా రుణపడి ఉంటాం. మేం వేటకు వెళ్ళినప్పుడు మరణిస్తే గతంలో రూ. 5 లక్షలు ఇస్తామనేవారు కానీ ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు ఇస్తున్నారు. ఆ కుటుంబానికి ఒక అన్నగా, కొడుకుగా ఉండి భరోసానిచ్చి మేం రోడ్డుమీద పడకుండా చూస్తున్నారు. మేము వేటకు వెళ్ళేటప్పుడు డీజిల్‌ అనేది చాలా అవసరం, గతంలో రూ. 6.03 సబ్సిడీ ఇస్తామనేవారు కానీ వచ్చింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వంలో రూ. 9 సబ్సిడీ ఇచ్చి మాకు చాలా చాలా మేలు చేశారు. మాకు అనేక రకాలైన పథకాలు ప్రవేశపెట్టి ఇది మహిళా ప్రభుత్వంగా పాలించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పిల్లలను ఒక కలెక్టర్‌గా కానీ డాక్టర్‌గా, ఇంజినీర్‌గా తీర్చిదిద్దుతానన్న సంతోషంగా ఉంది. నా పిల్లలకు మేనమామగా మంచి చదువులు అందించడం, పౌష్టికాహారం ఇవ్వడం సంతోషం. ఆరోగ్యశ్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నా కుటుంబానికి మీరు పెట్టిన పథకాల వల్ల రూ. 2.60 లక్షల లబ్ధి జరిగింది. గత ప్రభుత్వంలో నేను రూపాయి తీసుకోలేదు. మా ప్రతి అడుగు మీదై ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 


*మత్స్యకారుడు, ఉప్పాడ* 


అన్నా వందనాలు. మాకు రెండు నెలల స్ట్రైక్‌ సమయంలో గడిచేది కాదు. గతంలో బియ్యం కొంతమందికే వచ్చేవి కొంతమందికి రాలేదు. మీరు మాత్రం చెప్పిన మాట ప్రకారం మత్స్యకారులకు రూ. 10 వేలు ఇస్తున్నారు. మాకు ఇబ్బంది లేదు. మా అందరి కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారు. మీరు బటన్‌ నొక్కిన రోజు మాకు అందరికీ పండుగ, ఆ రోజు పండుగలా ఉంటుంది. మీరు మమ్మల్ని దేవుడిలా కాపాడుతున్నారు. మేం పెద్దగా చదువుకోలేదు, మా పిల్లలని మీరు చదివిస్తున్నారు, మాలా వారి జీవితాలు ఉండకూడదని మీరు గొప్పగా ఆలోచించారు. మా పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియం బావుంది, భోజనం బావుందని సంతోషంగా చెబుతున్నారు. మా అమ్మకు ఫించన్‌ వస్తుంది, మేం రమ్మన్నా కూడా అమ్మ నాకు పెద్ద కొడుకు జగన్‌ ఉన్నాడు మీరు భాదపడవద్దు అంటుంది. ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ లో చేస్తున్నారు. వలంటీర్లు చాలా ఉపయోగపడుతున్నారు, వారు ఇంటికి వచ్చి సేవలు చేస్తున్నారు. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. మా మత్స్యకారులకు 50 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తున్నారు, ఇది మీ ఘనతే. విశాఖపట్నం నుంచి కళింగపట్నం వరకు హర్బర్‌ ఉండేది కాదు కానీ ఇప్పుడు హర్బర్లు వస్తున్నాయి. మా ఉప్పాడ హర్బర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల మా మత్స్యకారుడు వేటకు వెళ్ళి చనిపోతే మూడు నెలలు తిరగకముందే రూ. 10 లక్షలు ఇచ్చారు. మా మత్స్యకారులందరి తరపునా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image