నెల్లూరు, మే 18 (ప్రజా అమరావతి): పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.
బుధవారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలోని జొన్నవాడ, రామచంద్రాపురం జగనన్న లే అవుట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాన్ని లబ్దిదారులు వినియోగించుకుని, ఈ పథకంలో భాగస్వాములై తమ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జొన్నవాడ లేఅవుట్ లో లబ్ధిదారులు తమకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, లే అవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ వెంట హౌసింగ్ పిడి శ్రీ నరసింహ, మండల ప్రత్యేక అధికారి శ్రీమతి ఉషారాణి, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ జానీ, తాసిల్దార్ ఎన్ శ్రీనివాసులు, ఈఈ దయాకర్, డిఇ జగదీశ్వరీ, ఏఇ గౌస్ మోహీద్దీన్, పంచాయతీ కార్యదర్శి చలపతి, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.
addComments
Post a Comment