కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ద్వారా ఇసుక టెండర్ల ప్రక్రియ జరిగింది.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


ఎపిఎండిసి కార్యాలయంలో 

గనులు మరియు భూగర్భ శాఖ సంచాలకులు (FAC) డబ్ల్యు బి చంద్రశేఖర్ గారి ప్రెస్ మీట్


రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాపై పత్రికల్లో కొన్ని తప్పుడు కథనాలు వచ్చాయి. వాటిపై వాస్తవాలను మీడియా ముందుకు తీసుకురావాలనే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అత్యత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడా ఎటువంటి అక్రమాలు  జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో, గనులశాఖ విజిలెన్స్ బృందాలు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఇసుక ఆపరేషన్స్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా, ఆరోపణలు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గనులశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మీడియాలో వచ్చిన కొన్ని ఆరోపణలపై వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాము. 



ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్లాలోనూ, మధ్యప్రదేశ్ లోని నిగ్రీలోనూ రిజిస్టర్డ్ చిరునామాలు ఉండి, ఢిల్లీలో కార్పోరేట్ కార్యాలయం ఉన్న జెపి సంస్థ కాంట్రాక్ట్ ను దక్కించుకుందని ఆరోపిస్తున్నారు. 

వాస్తవానికి  కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ద్వారా ఇసుక టెండర్ల ప్రక్రియ జరిగింది.


దీనిలో జాతీయ స్థాయిలో అర్హత ఉన్న ఏ  సంస్థ అయినా పాల్గొనవచ్చు.  జాతీయ స్థాయిలో కార్యకలాపాలు జరిపే సంస్థలు పోటీ పడితే ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఇందులో తప్పేమి ఉంది. 


అలాగే జెపి సంస్థ ప్రతినిధులు, ఉద్యోగులు ఎపిలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పెద్దగా నిమగ్నం కాలేదంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఇసుక ఆపరేషన్స్ టెండర్ దక్కించుకున్న జెపి సంస్థ ప్రభుత్వానికి సెక్యూరిటీ డిపాజిట్ కూడా ముందుగానే రూ.120 కోట్లు చెల్లించింది. ఇసుక ఆపరేషన్స్ సక్రమంగా చేయకపోతే ఆ డిపాజిట్ ను ప్రభుత్వం జమ చేసుకుంటుంది. అటువంటప్పుడు ఏ సంస్థ అయినా తాము దక్కించుకున్న కాంట్రాక్ట్ లో పాల్గొనకుండా నిర్లక్ష్యంగా ఉంటుందా?


 జెపి సంస్థ సబ్ కాంట్రాక్టర్ గా టర్న్ కీ ఎంటరప్రైజెస్ సంస్థను రంగంలోకి దించిందని, కేబినెట్ నిర్ణయానికి వారం రోజుల ముందే టర్న్ కీ సంస్థ ఆవిర్భావించిందని  ఆరోపించారు. అయితే 

వాస్తవానికి టెండర్ నిబంధనల్లోనే కాంట్రాక్టింగ్ ఏజెన్సీ తన వెసులుబాటు కోసం సబ్ కాంట్రాక్ట్ ఇవ్వవచ్చని ఉంది. దాని ప్రకారమే జేపి సంస్థ సబ్ కాంట్రాక్ట్ పనులను టర్న్ కీ అనే సంస్థకు అప్పగించింది. ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనా లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి ఆధ్వర్యంలో జరిగిన టెండర్లలో జేపీ సంస్థకే కాంట్రాక్ట్ దక్కుతుందని రాష్ట్రప్రభుత్వం ఎలా ఊహిస్తుంది? అలా టెండర్లు దక్కించుకున్న జేపీ సంస్థ సబ్ కాంట్రాక్ట్ కింద టర్న్ కీ సంస్థకు పనులు అప్పగిస్తుందని ఎలా అంచనా వేస్తుంది. ఇటువంటి ఆరోపణలు  అర్థరహితం.

 ప్రభుత్వం ఇసుక ఆపరేషన్స్ ను కాంట్రాక్ట్ కు ఇచ్చిన తరువాత కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఆపరేషన్స్ జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంది. పనుల కోసం ఎవరిని తీసుకువచ్చారు అనేది కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇష్టప్రకారం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్కిల్డ్ లేబర్ ను ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు తీసుకువస్తుంటాయి. 


 ప్రభుత్వం జేపీ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ అప్పగించింది. టర్న్ కీ వ్యవహారాలతో ప్రభుత్వానికి నేరుగా సంబంధం ఉండదు. ఎక్కడైనా ఇసుక ఆపరేషన్స్ లో నిబంధనల ఉల్లంఘనలు జరిగితే జేపీ సంస్థపైనే చర్యలు ఉంటాయి. ఇసుక ఆపరేషన్స్ ను ఎప్పటికప్పుడు గనులశాఖ పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా సరే చిన్న ఆరోపణ వచ్చినా, పిర్యాదు దాఖలైనా వెంటనే స్సందిస్తోంది.


 ఇసుక అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణా తదితర చట్టవిరుద్దమైన కార్యక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీనికోసం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్ 14500 అందుబాటులోకి తెచ్చింది. అక్రమాలకు పాల్పడితే రెండేళ్ళు జైలుశిక్ష, జరిమానా వంటి చట్టాలను తీసుకువచ్చింది. ఇసుక ఆపరేషన్స్ లో ఉల్లంఘటనలు జరుగుతున్నాయనడంలో వాస్తవం లేదు. అలాగే ఎస్ ఇ బి పట్టించుకోవడం లేదు అనడంలోనూ వాస్తవం లేదు.


రాష్ట్రంలో అన్నిచోట్లా వే బ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా ఓవర్ లోడింగ్ జరగడం లేదు.


ఇసుక కొనుగోళ్ళకు సంబంధించి

నగదును ఆన్ లైన్ లో చెల్లించేందుకు అవకాశం ఉంది. అందుకు సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్లను ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్లు, డిపోల వద్ద జేపీ సంస్థ వినియోదారులకు అందుబాటులో ప్రదర్శిస్తోంది. నగదు మాత్రమే తీసుకుంటున్నారనే ఆరోపణ అవాస్తవం.


 ఇసుక మాఫియాకు ముక్కుతాడు వేస్తూ... వినియోగదారులకు సులువుగా ఇసుక లభించేందుకు అనుగుణంగా నూతన ఇసుక విధానంను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం అమలులో కొన్ని ఓడిదొడుకులు ఎదురైనప్పటికీ వాటిని సమీక్షించుకుంటూ ఎక్కడా కూడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే వినియోగదారులకు ఇసుకను అందిస్తోంది.


Comments