మద్దతు ధర విషయంలో మిల్లర్లు రైతులకు మార్గ దర్శకాలు మేరకు చెల్లింపులు జరపాలికొవ్వూరు (కాపవరం)  ప్రజా అమరావతి);


మద్దతు ధర విషయంలో మిల్లర్లు రైతులకు మార్గ దర్శకాలు మేరకు చెల్లింపులు జరపాల


ని జిల్లా కలెక్టర్ కే. మాధవి లత పేర్కొన్నారు


 శుక్రవారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో లే అవుట్, అర్భికే ను తనిఖీ చేశారు.  అనంతరం,  విలేకరులతో మాట్లాడుతూ రైతులు పండించడం దానికి మద్దతు ధర కల్పించడం ద్వారా  రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంతమేర ధాన్యం తడిచిందన్నారు.  రైతులు ఆ ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు చేర్చాలని సూచించారు. రైతుల నుంచి ధన్యం కొనుగోలు సమయంలో తేమశాతం విషయంలో మిల్లర్లు సహకరించాలని, అందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ పూర్వకంగా మోసం మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లైతే సంబంధించిన మిల్లర్లు పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్  హెచ్చరించారు. మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.  రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకి సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.


ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం అన్ని. విధాలుగా ఇంటి నిర్మాణాలకు కావలసిన సిమెంట్,  ఇసుక, కంకర అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  కాపవరం లో 233 లే అవుట్ లలో 218 మందికి ఇంటి నిర్మాణం కోసం మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇందులో 199 మందికి ప్రభుత్వ లే అవుట్ లు, మరో 19 మంది స్వంత స్థల యజమానులు ఉన్నారన్నారు. ఏడు ఇంటి నిర్మాణాలు పూర్తి అవ్వగా, మిగిలిన వీటిలో 137 బిబిఎల్, 47 బీఏల్, 16 రూఫ్ లెవెల్, 15 రూఫ్ కంప్లీట్ అయ్యాయని తెలిపారు. ఈ లే అవుట్ లో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు రు.42,41,600 లు విడుదలైన ట్లు తెలిపారు. లబ్దిదారులు ఎంత త్వరగా ఇంటి నిర్మాణాలు చేపడితే ఆయా నిర్మాణాల స్థాయికి అనుగుణంగా లబ్దిదారుల ఖాతాకు నిధులు జమ చెయ్యడం జరుగుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్.మల్లిబాబు, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, తదితరులు ఉన్నారు.Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image