కోనసీమ జిల్లా వాసిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నామ



రాజమహేంద్రవరము, (ప్రజా అమరావతి);


కోనసీమ జిల్లా వాసిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ  జిల్లాగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నామ


ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు.


బుధవారం స్థానిక ప్రైవేటు సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో అడుగడుగున డాక్టర్ బియర్ ఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి అక్కడి ప్రజలు అభిమానిస్తారు. దేశంలో ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలు ఉన్న ప్రాంతం  కోనసీమ అన్నారు. స్థానిక ప్రజల మనోభావాలను గుర్తించిన ముఖ్యమంత్రి కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల ఈ ప్రాంత వాసులుగా ఎంతో హర్షాతిరేకాలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియ  చేస్తామన్నారు.  బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మణీయం అన్నారు. ముఖ్యమంత్రికి బడుగు, బలహీన వర్గాల, వెనుకబడిన కులాల, ఆర్థికంగా వెనుకబడిన వారీ పట్ల ముఖ్యమంత్రికి ఎంతో అభిమానం ఉందన్నారు. మా కళ్ళల్లో ఆనందం మే జగన్ మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. సామాన్యుడు జీవితానికి సరైన భద్రత భరోసా ఇచ్చిన నాయకుడన్నారు.  రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనచేసి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి అన్నదే మనముఖ్యమంత్రి ఆశయంఅన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గా నామకరణం చేయడంలో మంత్రి పినిపే విశ్వరూప్, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి,తాను, మరెందరో ప్రజా ప్రతినిధులు కృషి చేశారన్నారు. ఇప్పటికే జిల్లాలో పండుగ వాతావరణం ఉందన్నారు. 



Comments