తయారీ రంగంలో అత్యాధునికత అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీ

 

దావోస్‌ (praja amaravati);


తయారీ రంగంలో అత్యాధునికత

అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీ 




మార్గనిర్దేశంకోసం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంతో ఏపీ ఒప్పందం

కాలుష్యంలేని ఇంధనాలపై సీఎం ప్రత్యేక దృష్టి

పలువురితో చర్చల్లో పంప్‌డ్డ్‌స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై చర్చలు

రాష్ట్రంలో మౌలికసదుపాయాల అభివృద్ధిపై వివరించిన సీఎం

పోర్టు ఆధారిత పారిశ్రామీకరణపైనా చర్చల్లో ముఖ్యమంత్రి దృష్టి

విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురి ప్రశంసలు

పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయన్న ప్రముఖులు


తొలిరోజు దావోస్‌లో బిజీబిజీగా ముఖ్యమంత్రి

పలువురు ప్రముఖులతో వరుస సమావేశాలు

కాంగ్రెస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం సమావేశం

అక్కడే డబ్ల్యూఈఎఫ్‌ హెల్త్‌ విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో సీఎం భేటీ. ఆరోగ్య రంగంపై చర్చ

తర్వాత  ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం 

రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడులకు అవకాశాలనూ వివరిస్తూ ఏపీ పెవిలియన్‌

ఏపీ పెవిలియన్‌లోనే డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం భేటీ

డబ్ల్యూఈఎఫ్‌ ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై ఒప్పందం.

ఆతర్వాత బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ

సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే

ముఖ్యమంత్రితో సమావేశమైన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ


దావోస్‌:

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, 

అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్‌ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. పంప్‌డ్డ్‌స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియాల తయారీపై పలువురితో చర్చింరారు. 

విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై వీరు ప్రశసంలు కురిపించారు.  పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని వారు కొనియాడారు. 

వరుస సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి. 


1.

డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ సెంటర్లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయిన ప్రొఫెసర్‌ క్లాజ్‌ అన్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్‌ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషించగలదన్నారు. 


అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్‌ ష్వాప్‌ ఆహ్వానించారు. 


రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్‌ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలను చర్చించారు. మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడమే కాకుండా, పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాలపైనా సీఎం మాట్లాడారు. సోషల్‌ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్‌ వేదికద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్‌ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని వివరించారు. 


2. 

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆరోగ్యం– వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్‌ సెంటర్లో సీఎం సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైనా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి 2వేల జనాభాకు వైయస్సార్‌ క్లినిక్స్, గ్రామ–వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కావాలని సీఎం విజ్ఞప్తిచేశారు. 


3. 

ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్‌ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆతర్వాత వివిధ ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. 


4. 

డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయిన్‌ బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తోనూ సీఎం, ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశిత చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్‌చేయాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. 

ఇలాంటి సమస్యల నేపథ్యంలో పంప్డ్‌స్టోరేజీ కాన్సెప్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని సీఎం వివరించారు. విండ్, సోలార్, హైడల్‌.. ఈమూడింటిని కూడా సమీకృత పరిచే ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టామని, భవిష్యత్తు సవాళ్లకు ఇదొక చక్కని పరిష్కారం కాగలదని సీఎం వివరించారు. ఇలా వచ్చే కరెంటును రవాణా వ్యవస్థలకు వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. 


తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో  రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం  లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది. 


5. 

తదుపరి సీఎం... బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌తో సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్‌ డెస్క్‌ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్‌వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ ప్రశంసించారు. నైపుణ్యమానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.


6. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్‌ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. 


7. తర్వాత ముఖ్యంత్రి అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image