గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా

 *గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రాష్ట్ర  పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా


*


 *సారె సమర్పించడం నా పూర్వజన్మ సుకృతం...,*


*రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా*


తిరుపతి, మే14 (ప్రజా అమరావతి): 

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా గంగమ్మ తల్లికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా శనివారం ఉదయం సారె సమర్పించారు. స్థానిక నడి వీధి గంగమ్మ  ఆలయం వద్ద నుంచి వూరేగింపుగా సారె తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్వాగతం పలికి, ఆలయంలోకి తీసుకెళ్లారు. మంత్రి రోజాకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ....


తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారికి  సారె  సమర్పించడం తన పూర్వ జన్మ సుకృతం అని అన్నారు.  ఈ ప్రాంతంలోనే పుట్టిపెరిగిన  అమ్మవారి మహిమల గురించి అందరికీ తెలుసని గుర్తు చేశారు.  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందన్నారు. గంగమ్మ ఆలయానికి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉందని, సాక్షాత్తు అనంతాచార్యులు  స్వాములవారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారని తెలిపారు.  జాతర ఈ ఆలయం నుంచి ప్రారంభం అయిందన్నారు.  గతంలో తిరుమల కొండకు ఎవరైనా  రావాలనుకుంటే... ముందుగా గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని  తర్వాతే వెళ్లేవారని అన్నారు.  ఇక మీదట కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు.  జాతరను పురస్కరించుకుని తిరుపతి సమీప ప్రాంతాల ప్రజలంతా అమ్మవారికి సారె సమర్పించుకుని, 

తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటారని వివరించారు.  గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని తాను  కోరుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు.


*పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే భూమన*


తిరుపతి గంగ జాతర వైభవంగా నిర్వహించేందుకు మంత్రి రోజా తన మంత్రిత్వ శాఖ ద్వారా సంపూర్ణ సహాయ సహకారాలను అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, తదితులు పాల్గొన్నారు.

Comments