చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న సీఎం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*ఉపాధి హామీపథకం, గ్రామీణ రహదారులు, తాగునీటిపై కీలక సమీక్ష నిర్వహించిన సీఎం.*


*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల ప్రగతిని వివరించిన అధికారులు.*

*జిల్లాల వారీగా పనుల పురోగతిని వివరించిన అధికారులు.*

*నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామన్న అధికారులు*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే... :*

చెరువులను కాలువల ద్వారా  అనుసంధానం చేసే దిశగా పనిచేయాలన్న సీఎం.


తద్వారా రానున్న ఐదేళ్లలో ప్రతిచెరువును కెనాల్స్, ఫీడర్‌ ఛానెల్స్‌కి లింక్‌ చేయగలిగితే... నీటిఎద్దడిని నివారించగలుగుతామన్న  సీఎం

కడప, అనంతపురము లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్‌ చేయాలి.

దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించిన సీఎం.


*త్వరితగతిన భవన నిర్మాణాల పూర్తి*

ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, విలేజీ క్లినిక్స్‌కు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

వీటీపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న ముఖ్యమంత్రి.

ప్రతిచోటా నవరత్నాలు ఫోటో ఉండేలా చూడాలని ఆదేశం.


గత ప్రభుత్వ హయాంలోని బిల్లులు మనం చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు వచ్చాయి.

అయినా ఇబ్బందులు అధిగమించి ఆ బకాయిలు చెల్లించాం.

భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.

భవన నిర్మాణ పనులు ఆగకూడదు... అలాగని పనులు చేస్తున్నవారు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ఉపాధి హామీ పనులుకు సంబంధించి... బిల్లులు అప్‌లోడ్‌ తో పాటు చెల్లింపుల్లో కూడా ఆలస్యం కాకూడదు.

ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలి.

అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలి.

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలన్న సీఎం


*వైయస్సార్‌ జలకళ..*

వైఎస్‌ఆర్‌ జలకళ కింద అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. 

ఈ పథకం కింద నాణ్యమైన మోటార్లు ఎంపిక చేయాలి.

175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలి. దీని గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్న సీఎం 

నియోజకవర్గానికి ఒక రిగ్గు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి.

 ఇప్పటివరకు 13,245 బోర్లు వేశామన్న అధికారులు.

ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామన్న సీఎం.

బోరు డ్రిల్లింగ్‌ డబ్బులు రైతు అకౌంట్‌కు నేరుగా (డీబీటీ విధానంలో) జమ చేసి.. .అతని నుంచి పేమెంట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలన్న సీఎం

దీనివల్ల లంచాలు లేని వ్యవస్ధను తీసుకురాగలుగుతామన్న సీఎం.

దానికి తగిన విధంగా ఎస్‌ఓపీలు రూపొందించాలన్న సీఎం.

ఫలితంగా మరింత పారదర్శకత పెరుగుతుందన్న సీఎం.

ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకుఅన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు.

5–10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు  కేవలం డ్రిల్లింగ్‌ మాత్రమే ఉచితం.



*గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు....* 

గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్న సీఎం.

రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు.

ఆర్‌ అండ్‌ బీలో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు తక్షణమే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశం.

వెంటనే టెండర్లకు వెళ్లాలన్న సీఎం.

అనంతరం తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశం.

ఆర్‌ అండ్ బి, పంచాయితీరాజ్‌ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్‌ప్లే చేయాలి.


మే 15 -20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలన్న సీఎం.

పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి సంబంధించిన పనులు అత్యధిక ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్న సీఎం.

పాట్‌ హోల్‌ ఫ్రీ బీటీ రోడ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.


గ్రామ, వార్డు సచివాలయంలో నాడు-నేడు పనులకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్యం, రహదారులుపై చేపట్టిన పనులకు సంబంధించి ఫోటోలను డిస్‌ప్లే చేయాలన్న సీఎం.

రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను కూడా డిస్‌ప్లే చేయాలి.


జలజీవన్‌ మిషన్‌ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలన్న సీఎం

జలజీవన్‌ మిషన్‌కు సంబంధించి నాబార్డు, కేంద్రం సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలి అధికారులకు సీఎం  ఆదేశం.


*సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌...*

గ్రామాల్లో మురుగునీటి కాలువలు నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.

 గ్రామాలలో  రోడ్లమీద మురుగునీరు, చెత్త లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం.

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలి.

అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ పక్కాగా ఉండాలి, ఊర్లన్నీ క్లీన్‌గా కనిపించాలి.

2 కోట్ల డస్ట్‌బిన్లను అక్టోబరు నాటికి  సిద్ధంగా ఉంచుతామన్న అధికారులు.

తడి, పొడి చెత్తలపై విడివిడిగా అవగాహన కలిగించాలన్న సీఎం.

ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్‌ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్న సీఎం

దశలవారీగా దాన్ని చేరుకోవాలన్న సీఎం

రోడ్డుమీద ఎక్కడా చెత్త, మురుగునీటి ప్రవాహం కనిపించకూడదని ఆదేశం.

హై ప్రెజర్ టాయ్‌లెట్ క్లీనర్స్‌ నెంబర్లు ప్రతిగ్రామంలోనూ డిస్‌ప్లే చేయాలన్న సీఎం. 

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌కు సంబంధించిన క్లాప్ మిత్ర జీతాలు చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.


*లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌...*

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో దశలవారీగా లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ చేపట్టాలన్న సీఎం

46 లిక్విడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మాణం చేపట్టిన తర్వాత 632 డీస్లడ్జింగ్‌ మిషన్స్‌ అందుబాటులోకి తీసుకొస్తామన్న అధికారులు.

దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తీసుకురావాలన్న సీఎం.

13వేల గ్రామ పంచాయతీల్లో కూడా మురుగునీటిపారుదల వ్యవస్ధ ఉండేలా... రోడ్లమీద చెత్త, కాలువల్లో మురుగునీరు ఓవర్‌ప్లో కాకుండా సక్రమంగా నిర్వహణ చేపట్టాలి.

ఇందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడంతో పాటు... దాన్ని సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న సీఎం

గ్రామసచివాలయంలో ఈ మొత్తం మురుగునీటి వ్యవస్ధ నిర్వహణతో పాటు ఆ సచివాలయ పరిధిలో ఉన్న స్కూళ్లలో బాత్రూమ్‌ల పర్యవేక్షణ కూడా పంచాయతీ సెక్రటరీకి బాధ్యతలు అప్పగించాలన్న సీఎం.

స్కూల్స్‌లో హెడ్‌మాష్టారుతో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఈ బాధ్యతలు తీసుకోవాలి.

పాఠశాల విద్యాశాఖతో కూడా సమన్వయం చేసుకోవాలన్న సీఎం.



*వేసవిలో తాగునీటి సరఫరాపైనా సీఎం సమీక్ష.*

నీటి ఎద్దడి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న అధికారులు.

జూలై వరకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామన్న అధికారులు.

తాగునీటి కోసం తీసుకున్న శాశ్వత చర్యల వల్ల గతంలో పోల్చుకుంటే వేసవి నీటి ఎద్దడిని గణనీయంగా తగ్గించగలిగామన్న అధికారులు.


తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సెలైనిటీ ప్రభావం,  ఉద్దానంలో ప్లోరైడ్‌ ప్రభావం, వైయస్సార్‌ జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న సీఎం.


ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments