గుంటూరు (ప్రజా అమరావతి); నగరంలో ని నల్లచెరువు మరియు సూర్యదేవర ఎస్టేట్ నందు గల పీకల వాగును ప్రత్యక్షంగా పరిశీలించి,రానున్న రాబోవు వర్షాకాలం నాటికి గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాల మీదగా వస్తున్న పీకల వాగు మరియు ప్రధాన డ్రైన్ల యందలి పేరుకు పొయిన సిల్ట్ ను పూర్తి స్థాయిలో తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ,
నగరంలోని పీకలవాగు మరియు ప్రధాన డ్రైన్ల లోని సిల్ట్ ను పూర్తి స్థాయి లో తొలగించక పోవడం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని గృహాలు జలమయం అవుతున్నాయ
ని,
సదరు సమస్యను పరిష్కరించుటకు ఈ వేసవి కాలంలోనే వర్షాకాలం వచ్చేలోపు పీకలవాగు మరియు ప్రధాన డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేయాలన్నారు.
గుంటూరు నగరంలో ఉన్న ప్రధాన అవుట్ఫాల్ డ్రైన్ అయిన పీకల వాగు నందలి సిల్ట్ ను పూర్తిస్థాయిలో తొలగించాలని,ఇంజనీరింగ్ అధికారులు మరియు సచివాలయ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలన్నారు.
రానున్న వర్షాకాలం నాటికి గుంటూరు నగరంలో సిల్ట్ తొలగింపు పనులు నూరు శాతం పూర్తి చేయాలి.
పీకలవాగు ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సిల్ట్ తొలగింపు పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలి.
సిల్ట్ తొలగింపునకు ఆ క్రమణలు ఏమైనా అడ్డుగా ఉంటే వెంటనే వాటిని తొలగించాలి.
సిల్ట్ తొలగింపు పనులను ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షేక్ ఫర్జానా అయూబ్,స్థానిక వైసీపీ నాయకులు బికారి,వెంకటేశ్వర రెడ్డి,D.రాజు, కొండారెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థఅధికారులు,సచివాలయాల సెక్రటరీలు పాల్గొన్నారు.
addComments
Post a Comment