విజయవాడ, (ప్రజా అమరావతి);
*NCC గ్రూప్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్టణం అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజశేఖర రెడ్డి నియామకం..
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సి. రాజశేఖర రెడ్డి ని నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నందు సహాయ సంచాలకులు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డైరెక్టరేట్ (AP & T) ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ వింగ్ గుంటూరు కార్యాలయ ఎయిర్ కమాండెంట్ పి. మహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అండ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 కు లోబడి ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల సంఖ్య ఎన్ సి సి (ఆంధ్ర ప్రదేశ్)/911/2/గజెటెడ్/ఎస్టాబ్లిష్ మెంట్/ఏ-1, తేదీ 06-05-2022 ద్వారా ఈ నియామకం చేసినట్లు అప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ పే రివిజన్ కమిషన్ 2022 పే స్కేల్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరి జీత భత్యములు చెల్లింపు చేయడం జరుగుతుందని పి. మహేశ్వర్ తెలిపారు.
addComments
Post a Comment