అమరావతి (ప్రజా అమరావతి);
*రేపు (07.06.2022, మంగళవారం) సీఎం శ్రీ వైయస్ జగన్ గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటన*
*ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.40 గంటలకు గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లో ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 – 11.30 గంటల వరకు డాక్టర్ వైయస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లను, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటుచేసిన హరిత నగరాలు నమూనాని ఆవిష్కరిస్తారు. 12.15 – 12.30 గంటల మధ్య జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్ ఆవిష్కరించి, ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
addComments
Post a Comment