తిరుపతిలో జులై 1 న " అప్రెంటీస్ షిప్ " జాబ్ మేళా..

 

విజయవాడ (ప్రజా అమరావతి);

*తిరుపతిలో జులై 1 న " అప్రెంటీస్ షిప్ " జాబ్ మేళా.. 

*పేరెన్నికగన్న 15 ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు అప్రెంటీస్ షిప్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.. 

*శిక్షణా కాలంలో కనీస స్టైఫండ్ నెలకు ఇంజినీరింగ్ వారికి రూ. 9 వేలు, డిప్లొమో వారికి రూ. 8 వేలు అందిస్తారు..

*ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..  

-సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీ పోలా భాస్కర్.. 

రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, బోర్డు అఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్ చెన్నై వారు సంయుక్తంగా జులై 1వ తేదీన తిరుపతిలో " అప్రెంటీస్ షిప్ జాబ్ మేళా " నిర్వహిస్తున్నాయని సాంకేతిక విద్యా శాఖా కమిషనర్ డా. పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.  

ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమో పాస్ అయినవారు ఈ అప్రెంటీస్ షిప్ జాబ్ మేళాలో పాల్గొనుటకు అర్హులని, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జులై 1 న ఉదయం 9.00 గంటలకు ఈ అప్రెంటీస్ జాబ్ మేళా ప్రారంభిస్తామని ఈ మేళాలో 15 పైబడి  ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు పాల్గొని సుమారు 1500 మందికి అప్రెంటీస్ షిప్ అవకాశాలను కల్పించనున్నాయని శ్రీ పోలా భాస్కర్ తెలిపారు.  

2019 సెప్టెంబర్ తరువాత ఇంజినీరింగ్ లో డిగ్రీ మరియు డిప్లొమో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు 3 సెట్లు, బయో డేటా తో ఇంటర్వ్యూ కు హాజరు కావలెనని అయన తెలిపారు.  అప్రెంటీస్ షిప్ ఫెయిర్ లో పాల్గొనే విద్యార్థులు తమ పేరును నేషనల్ వెబ్ పోర్టల్ www.mhrdnats.gov.in లో నమోదు చేసుకోవాలని ఈ అప్రెంటీస్ షిప్ ఫెయిర్ కు హాజరు అయ్యే సమయంలో పేరు, ఇంజనీరింగ్ బ్రాంచ్ వివరాలు, పాస్ అయిన సంవత్సరం పేర్కొంటూ యూసర్ ఐడి యొక్క నాలుగు సెట్లు ఫోటో కాపీని విద్యార్థులు తీసుకురావాలని కమిషనర్ పోలా భాస్కర్  తెలిపారు.  

శిక్షణా కాలంలో కనీస స్టైఫండ్ నెలకు ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ. 9 వేలు, డిప్లొమో వారికి రూ. 8 వేలు ఆందిస్తారని, ఇంజినీరింగ్ మరియు డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీ పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 


Comments