కాలువకు జూన్ 10వ తారీకు నుండి నీటిని వదలటం జరుగుతుంది

 మంగళగిరి (ప్రజా అమరావతి);  కాజ గ్రామంలోని గుంటూరు ఛానల్ సమస్యను తెలుసుకోవటానికి గుంటూరు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి , ఎమ్మెల్సీ హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే , MRO రామ్ ప్రసాద్  కాజ గ్రామంలో నంబూరు రోడ్డులో గుంటూరు ఛానల్ కొత్త కాలువ ను పరిశీలించారు...


ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రాబోవు ఖరీఫ్ పంట కోసం కృష్ణా డెల్టా నుండి సాగునీటి కోసం గుంటూరు ఛానల్ కాలువకు జూన్  10వ తారీకు నుండి నీటిని వదలటం జరుగుతుంద


ని అన్నారు.


కాజా గ్రామంలో గుంటూరు ఛానల్ కొత్త కాలువ వద్ద తూటాకు చేరటం వలన నీటి ప్రవాహం లేకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.


ఈ గుంటూరు ఛానల్ ద్వారా 28 గ్రామాలకు త్రాగు నీరు మరియు సాగునీరు అందుతుందని అన్నారు.


ఎమ్మెల్యే ఆర్కే గారి సూచన మేరకు గుంటూరు ఛానల్ కొన్నిచోట్ల బలహీనంగా ఉన్న బండ్ లను  స్ట్రేంత్ నింగ్ చేస్తామని అన్నారు.

Comments