జాతీయ లోక్ అదాలత్ ద్వారా సుమారు 10,500 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం ..జిల్లా జడ్జి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


జాతీయ లోక్ అదాలత్ ద్వారా సుమారు 10,500 కేసులు తూర్పు గోదావరి జిల్లాలో పరిష్కారం ..జిల్లా జడ్జి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి
సివిల్ తగాదాలు, రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జిల్లా జడ్జి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి అన్నారు.


ఆదివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి  ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించు కుంటున్నామన్నరు. జిల్లాలో 41 బెంచ్ లలో ఆదివారం లోక్ అదాలత్ నిర్వహించామని, వీటి ద్వారా సుమారు 10,500 కేసులు పరిష్కరించమని పేర్కొన్నారు. ఎన్ఎల్ఏ కోర్ట్ ద్వారా సివిల్ తగాదాలు, రాజీ పడదగిన కేసులను పరిష్కరించడం సాధ్యం అవుతుందన్నారు. ఫాక్సో, మర్డర్ వంటి కేసులు తప్ప, రాజీ ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్న కేసులకు పరిష్కారం చూపుతామని, ఈ కోర్టు కి గల ప్రత్యేక అధికారులతో అవార్డు జారీ సాధ్యం అవుతుందన్నారు. రాజీ పడదగిన వాటికి అవార్డ్ జారీ చేస్తే తిరుగు ఉండదన్నారు. ఉదాహరణ చెక్కు బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా, పరిహారం పై జాతీయ లోక్ అధాలత్ అవార్డ్ జారీ చేయ్యావచ్చునని అన్నారు. పైన పేర్కొన్న వాటిని ఈ కోర్టు ద్వారా విచారణ ,అప్పీల్ లో ఉన్న కేసు లకు సంబంధించిన రాజీ పడితే అవార్డ్ అమలుకు అవకాశం ఉందన్నారు.  ఇందుకోసం ఎటువంటి రుసుము ఉండదన్నారు. యదార్థం లోకి వెళ్ళ గలిగితే అన్ని తగాదాలకు పరిష్కారం సాధ్యం అవుతుందన్నారు. రవీంద్ర నాథ్ టాగూర్ మాటలను పేర్కొంటూ "విషయాలు ఎన్నో ఉంటాయి గానీ అందులో నిజం మాత్రం ఒక్కటే ఉంటుంది" అన్నారు. ఆశావహ దృక్పథంతో అడుగులు వెయ్యడం ద్వారా సమస్యల పరిష్కారానికి దారితీస్తుందని ఆమె తెలియచేశారు. జిల్లాలో కేసులు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ లు, పోలీస్, ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల సహకారంతో జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ ను చక్కగా నిర్వహించడం సాధ్యం అయిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటవ అదనపు జెడ్జి శ్రీమతి కె. సునీత, 5 వ అదనపు జిల్లా జడ్జిలు డి. విజయ గౌతమ్, 5వ అదనపు జిల్లా జడ్జి  పి ఆర్ రాజీవ్, 5వ అదనపు జిల్లా జడ్జి ఎమ్. నాగేశ్వర రావు, స్పెషల్ జెడ్జి ఏ సి బి - యూ యూ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారుComments