*అన్నదాతకు ఆర్థికంగా రక్షణనిస్తున్న డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా పధకం*
*•26 రకాల పంటలకు రూ.2,977.82కోట్ల మేర డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా సొమ్ము చెల్లింపు*
*•భీమా సొమ్ము అందని అర్హులు 15 రోజుల్లో ఫిర్యాదు చేస్తే సమస్యనుపరిష్కరించి సొమ్ము చెల్లిస్తాం
* *•ఈ పథకం అమలుతో రుణ ఎగవేతలు బాగా తగ్గాయని ప్రభుత్వాని కితాబు ఇచ్చిన బ్యాంకర్లు*
*•వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రప్రధమంగా నిలిచిందని కితాబు ఇచ్చిన కేంద్రం*
*•రాష్ట్ర్రంలో అమలవుతున్న వ్యవసాయ సుపరిపాలన ఫలితంగా పంటలవిస్తీర్ణంలో గణనీయ పెరుగుదల*
*రాష్ట్ర వ్యవసాయశాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య*
అమరావతి,జూన్ 15 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా.వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకం అన్నదాతలకు ఆర్థికంగా ఎంతో రక్షణ నిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ది మరియు మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎంఎఫ్బివైతో ఎటు వంటి సంబంధంలేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా రూపొందించి అమలుచేసున్న గొప్ప పధకం ఇదని ఆమె తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఎటు వంటి ఆర్థిక భారం లేకుండా ఉచిత పంటల భీమా పథకాన్ని మన రాష్ట్రంలోనే అమలు చేయడం జరుగుచున్నదన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నిరకాల పంటలకు భీమా పథకాన్ని వర్తింప చేయడం జరుగుచున్నదన్నారు. 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్ల మేర భీమా పరిహారాన్ని ఈ నెల 14 న రైతన్నల ఖాతాల్లోకి నేరుగా ప్రభుత్వం జమచేసిందన్నారు. సుమారు 26 రకాల పంటలకు భీమా పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. ఇటు వంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని ఆమె తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగానున్న 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తు నుండి విక్రయం వరకు సేవలను అందజేయడం జరుగుతున్నదని ఆమె అన్నారు. ఈ ఆర్బీకే ల్లోనే రైతులు వేసుకునే పంటల వివరాలను ముందుగానే నమోదు చేయించుకునే అవకాశాన్ని ఈ-క్రాప్ ద్వారా కల్పించడం జరిగిందన్నారు. పంట వివరాలను నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే ఇన్పుట్స్ రాయితీని రైతులకు అందజేయడం జరుగుచున్నదని ఆమె తెలిపారు. ఈ-క్రాప్ లో పంట వివరాల నమోదు ఆధారంగా రైతుల తరుపున ప్రీమియం చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వమే వహిస్తున్నదన్నారు. అదే విధంగా పంటల నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి మరుసటి ఏడాది సీజన్ ప్రారంభంలోపే పంట నష్ట పరిహారాన్ని రైతులకు చెల్లిండం జరుగుచున్నదని ఆమె తెలిపారు. పంట నష్ట పరిహారానికి అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ కై డిస్ప్లే చేయడం జరుగుతుందని, తదుపరి రైతుల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితాను ఖరారు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా జరుగుతుందని, అర్హులు అందరినీ ఈ పథకం క్రింద కవర్ చేయడం జరుగుతుందన్నారు. అయితే భీమా సొమ్ము అందని రైతులు ఎవరన్నా ఉంటే స్థానిక ఆర్బీకేల్లోగాని, గ్రామ సచివాలయాల్లోగాని లేదా కాల్ సెంటర్ కు గాని పిర్యాదు చేసినట్లైతే, సమస్యను పరిష్కరించి, పంట నష్ట పరిహారాన్ని అందజేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
*వ్యవసాయ సుపరిపాలనలో దేశంలోనే రాష్ట్రం ప్రధమం…….*
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తు నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందజేయడాన్ని గుర్తించి కేంద్రం వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రప్రధమంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వానకి కితాబును ఇచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు ఫలితంగా రుణ ఎగవేతలు బాగా తగ్గాయని ఈ మద్య జరిగిన ఎస్.ఎల్.బి.సి. సమావేశంలో బ్యాంకర్లు ప్రభుత్వానికి కితాబు ఇచ్చారన్నారు. రాష్ట్ర్రంలో అమలు అవుతున్న వ్యవసాయ సుపరిపాలన ఫలితంగా పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయంగా పెరుగుదల ఉందని ఆమె తెలిపారు.
*క్రాప్ అడ్వాన్సు వర్కే గాని క్రాప్ హాలిడే అవసరం లేదు…*
రైతులకు పెద్ద ఎత్తున మేలు చేసే విధంగా రైతులు ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం సాగునీటిని ముందుగానే విడుదల చేయడం జరిగిందని ఆమె తెలిపారు. తద్వారా క్రాప్ అడ్వాన్సు వర్కుకు రాష్ట్రంలో అవకాశాలు ఏర్పడ్డాయేగాని, క్రాప్ హాలిడే ప్రకటనకు ఎటు వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆమె స్పష్టంచేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment