*ఎసిబికి చిక్కిన మునిసిపల్ ఎస్‌ఇ సురేంద్రబాబు.. రూ.15 లక్షలు స్వాధీనం
* కర్నూలు క్రైం (ప్రజా అమరావతి): ఓ కాంట్రాక్టు పనికి సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు కర్నూలు మునిసిపల్ ఎస్‌ఇ సురేంద్రబాబు చిక్కారు. కర్నూలు ఎసిబి డిఎస్పీ శివనారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు... కర్నూలు నగర పాలక సంస్థలో ఇన్ ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ( ఎస్‌ఇ)గా విధులు నిర్వహిస్తున్న కె. సురేంద్రబాబు అమృత్ పథకం కింద కోటి 52 లక్షల రూపాయల బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఎస్‌ఇని కలిశాడు. సదరు ఎస్‌ఇ ఆ బిల్లు మొత్తాన్ని మంజూరు చేయాలంటే రూ.15 లక్షలు తనకు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ శ్రోనివాసులు రెడ్డిని డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో భాదితుడు ఎసిబి అధికారులను అశ్రయించాడు. గురువారం ఉదయం కర్నూలులోని కృష్ణనగర్ ఉపరితల వంతెన వద్ద ఎస్‌ఇ సురేంద్రబాబు సదరు కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సేవల కోసం ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
addComments
Post a Comment