ఈనెల 16,17 తేదీల్లో ధర్మశాలలో చీఫ్ సెక్రటరీల కాన్పరెన్సు:కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
అమరావతి,3 జూన్ (ప్రజా అమరావతి):ఈనెల 16,17 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములోని ధర్మశాలలో రెండు రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగనుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ(Rajiv Gauba)చెప్పారు.ఇందుకు సంబంధించి శుక్రవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశంలో సమీక్షించారు.ఈరెండు రోజుల సిఎస్ ల సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పాల్గొని సిఎస్ లతో పలు అంశాలపై ఇంటరాక్టు అవుతారని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ పేర్కొన్నారు.ప్రధానంగా నూతన విద్యా విధానం,కేంద్ర రాష్ట్ర సంబంధాలు,పంటల మార్పిడి విధానం(Crops Diversification),పియం గతిశక్తి తదితర అజెండా అంశాలపై రెండు రోజుల సిఎస్ ల సమావేశం కొనసాగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు తెలిపారు.ఇంకా ఈ వీడియో సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి.రాజశేఖర్, పూనం మాలకొండయ్య,ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సిడిఎంఏ ప్రవీణ్ కుమార్, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు హేమచంద్రారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment