ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ– 20 టోర్నమెంట్‌ లోగో ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌

 

అమరావతి (ప్రజా అమరావతి);


*ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ– 20 టోర్నమెంట్‌ లోగో ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌


*


సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్, సభ్యులు.


లోగోతో పాటు ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ – 20 టీజర్‌ను ల్యాప్‌టాప్‌లో ఆవిష్కరించిన సీఎం.


జులై 6 నుంచి జులై 17 వరకు విశాఖపట్నం డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టోర్నమెంట్, జులై 17న జరిగే ఫైనల్‌కు సీఎంను ఆహ్వనించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ టీమ్‌


ఐపీఎల్‌ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్, బీసీసీఐ నుంచి ఏపీఎల్‌ నిర్వహించేందుకు అనుమతులు పొందిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్, ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతులు, నాలుగో రాష్ట్రంగా ఏపి.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీఏ ప్రెసిడెంట్‌ పి.శరత్‌ చంద్రారెడ్డి, ట్రెజరర్‌ ఎస్‌.ఆర్‌.గోపినాద్‌ రెడ్డి, సీఈవో ఎం.వి.శివారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ టి.సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాల రాజు, టెక్నికల్‌ ఇంచార్జి విష్ణు దంతు, వీరితో పాటు హాజరైన ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి.

Comments