2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ

 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ



- సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపాదించిన నవరత్నాలే మాకు వేద మంత్రాలు

- భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం

 గుంటూరు (ప్రజా అమరావతి);     ఐదేళ్ల క్రితం ఇదే మైదానంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు చారిత్రకంగా, విభిన్న రీతిలో జరిగాయి. నవరత్నాల పేరుతో పార్టీ అజెండాను పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. నవరత్నాలే.. మాకు వేద మంత్రాలు అయ్యాయి. వాటినే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 95 శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్‌సీపీకి, సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. ఆచరణలో కూడా ఇంతటి నిబద్ధత కలిగిన నాయకుడితో ప్రయాణం చేస్తున్నందుకు పార్టీ శ్రేణుల నుంచి నాయకుల వరకు అందరం గర్వపడుతున్నాం. ఇదే ప్రాంగణంలో మరోసారి ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం సంతోషకరం. మరింత మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు వారి భావి భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ప్లీనరీ సమావేశాల్లో చేస్తాం. రాష్ట్ర భవిష్యత్, చరిత్ర ఇక ముందు వైఎస్సార్‌సీపీతో ముడిపడి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. పేదలు, ప్రజల ఆకాంక్షలను వైఎస్సార్‌సీపీ నెరవేరుస్తోంది. కోట్లాది మంది ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ను తమ హృదయాల్లో పెట్టుకున్నారు కాబట్టే వైఎస్సార్‌సీపీ ప్రయాణం, ప్రస్థానం ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది కేవలం పార్టీ ప్లీనరీ కాదు. ప్రజల అజెండా గురించి చర్చించి నిర్ణయాలు తీసుకునే వేదిక. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తోంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై 80 నుంచి 90 శాతం పైగా వైఎస్సార్‌సీపీ గుర్తు ఉండిపోయింది. ఇంత ఘనత కలిగిన పార్టీ కాబట్టే జూలై 8, 9న జరిగే ప్లీనరీకి వార్డు స్థాయిలో పోటీ చేసిన వారి దగ్గరి నుంచి.. అందరినీ తన సంతకంతో కూడిన లేఖ ద్వారా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆహ్వానించడం చరిత్రాత్మకం. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోతే.. స్థానిక నాయకులు చొరవ తీసుకుని ఆహ్వానాలు ఇవ్వడంతో పాటు కార్యకర్తలంతా ఈ ప్లీనరీకి హాజరయ్యేలా చూడాలి.

Comments