విజన్ @2047(అమృత్ కాల్)పై సిఎస్ లతో సెక్టోరల్ గ్రూపు ఆఫ్ సెక్రటరీల వీడియో సమావేశం
అమరావతి,3జూన్ (ప్రజా అమరావతి);,రానున్న 25 ఏళ్ళకు సంబంధించి విజన్@2047 (అమృత్ కాల్) డాక్యుమెంట్ రూపకల్పనకు సంబంధించి సూచనలు,సలహాలు తీసుకునేందుకు ఢిల్లీ నుండి సెక్టోరల్ గ్రూపు అఫ్ సెక్రటరీలు శుక్రవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ వీడియో సమావేశంలో కేంద్ర ఆహార,పౌరపంపిణీ శాఖ కార్యదర్శి సుదాన్సు పాండే మాట్లాడుతూ గత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడి ప్రసంగానికి అనుగుణంగా గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు సంబంధించి దేశ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా రానున్న 25 ఏళ్ళకు విజన్ @2047(అమృత్ కాల్)డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్టు చెప్పారు.ఇందుకుగాను 14 శాఖలకు చెందిన గ్రూప్ ఆఫ్ కార్యదర్శులు సమిష్టి కృషి సల్పుతున్నాయని అన్నారు.ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సంబంధిత స్టేక్ హోల్డర్లుతో సంప్రదించడంతో పాటు జిల్లాల కలక్టర్లు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సహా ఇతర కార్యదర్శుల సూచనలు,సలహాలను తీసుకుని ఈడాక్యుమెంట్ ను రూపొందించ నున్నట్టు ఆమె పేర్కొన్నారు.ఈవిజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రధానంగా 5 లక్ష్యాలను నిర్దేసించినట్టు కేంద్ర ఆహార,పౌరపంపిణీ శాఖ కార్యదర్శి సుదాన్సు పాండే పేర్కొన్నారు.
ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఇనిస్టిస్ట్యూషన్స్ అండ్ గవర్నెన్స్ అనే లక్ష్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ,వార్డు సచివాలయం వ్యవస్థలు మెరుగైన రీతిలో ప్రజలకు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు.అలాగే ఇతర లక్ష్యాలకు అనుగుణంగా డిజిటల్ లైబ్రరీల వ్యవస్థ,హెచ్ఆర్డికి సంబంధించి విలేజ్ హెల్తు క్లినిక్లు,విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు విజన్ @2047 డాక్యుమెంట్ రూపకల్పనకు దోహదం చేస్తాయని తెలిపారు.అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు రైతాంగానికి సంబంధించి అనేక సేవలు అందించడం జరుగుతోందని సిఎస్ డా.సమీర్ శర్మ కేంద్ర కార్యదర్శికి వివరించారు.వివిధ పంటలను నమోదు చేయడం,ఇ-క్రాపింగ్,పొలంబడి,కమ్యునిటీ హైరింగ్ కేంద్రాలు ద్వారా రైతులకు అవసరమైన యాంత్రీకరణ పనిముట్లు అందించడంతో వారికి చాలా వరకూ కూలీల ఖర్చులు తగ్గిపోతున్నాయని చెప్పారు.అంతేగాక ఆహార శుద్ది రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు ప్రకృతి సేధ్యపు విధానాలను అవలంబించడం జరుగుతోందని ఈవిధానాన్నీ విజన్ డాక్యుమెంట్ రూకల్పనకు దోహదం చేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.
ఈ వీడియో సమావేశంలో పిఆర్ అండ్ ఆర్డిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్,వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూధన రెడ్డి,ప్రణాళికా శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్,ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి,పౌర సరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి గిరిజా శంకర్, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ కోన శశిధర్,సిడిఎంఏ ప్రవీణ్ కుమార్,వ్యవసాయ శాఖ కమీషనర్ హరికిరణ్,అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment