ఇరికేపల్లి గ్రామానికి తక్షణమే 20 లక్షలు నిధులు మంజూరు : కలెక్టర్ "శివశంకర్"

 ఇరికేపల్లి గ్రామానికి  తక్షణమే 20 లక్షలు  నిధులు మంజూరు :  కలెక్టర్ "శివశంకర్"నరసరావుపేట, జూన్ 22 (ప్రజా అమరావతి) : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికే పల్లి గ్రామపంచాయతీ లోని 17, 18 వార్డులోని ప్రజల కు మంచి నీటి వసతి ఏర్పాటుకై తక్షణమే జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి 20 లక్షలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లో తేటి తెలిపారు. బుధవారం ఉదయం దాచేపల్లి మండలం ఇరికే పల్లి వాసుల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాలలో 10,12 పరిశ్రమలు ఉన్నాయని వాటి ద్వారా నీరు కాలుష్యం అవుతున్న విషయం గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పొందుగల నుంచి కృష్ణా జలాలను ఎస్ సి ఎస్ టి కాలనీ లోని పంపు హౌస్ కు తరలించడం జరుగుతున్నదని అయితే పులిచింతల ప్రాజెక్టు పనుల వల్ల నీటిని పంపు చేయుటకు ఏర్పాటుచేసిన 40 హెచ్ పి మోటారు నీటిలో మునిగి పోవడం జరిగినందున భూగర్భ జలాల వినియోగం జరుగుతున్నది సదరు భూగర్భ జలాలు చుట్టుపక్కల పరిశ్రమల కాలుష్యం అయ్యాయని ప్రజలు తమ దృష్టికి తీసుకోవడం జరిగిందని ఇదే విషయము స్థానిక శాసనసభ్యులు  తన దృష్టికి తీసుకురావడం జరిగింది తెలిపారు. తక్షణమే స్పందించి అవసరమైన చోట నీటిని ట్యాంకుల ద్వారా తరలించాలని సంబంధిత మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడం జరిగిందన్నారు. నీటి కాలుష్యం, గాలి కాలుష్యం పై నిర్ధారించేందుకు తక్షణమే పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి, ఏపీఐఐసీ, మరియు మున్సిపల్ కమిషనర్ తో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని సదరు కమిటీ నివేదిక ఆధారంగా చేసుకొని నిబంధనల అధిగమించి నీటి కాలుష్యం లేదా వాయు కాలుష్యం జరుగుతున్నట్లు గుర్తించినట్లయితే సదరు విషయంపై కమిషనర్ ఇండస్ట్రీస్, మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చించి కంపెనీలను తక్షణమే మూసి వేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కమిటీ నివేదిక మేరకు నిబంధన మేరకు కాలుష్యం కల్పిస్తున్న కంపెనీల 3, నాలుగు నెలల కాలపరిమితి ఇచ్చి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని అందుకోసమే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇరికేపల్లి వెళ్లినప్పటికీ  స్థానిక  ప్రజలు తనను మాట్లాడించే అవకాశం ఇవ్వలేదని వేరే మీటింగ్ ఉన్నందువలన వెంటనే నరసరావుపేట తిరిగి వెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డిఓ అద్దయ్య, డి పి ఓ రాజేష్, దాచేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీవిద్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు  నారాయణ, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రాజశేఖర్, మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వర నాయక్, ఎంపీడీవో మహాలక్ష్మి వివిధ శాఖ అధికారులు.. తదితరులు పాల్గొన్నారు.Comments