జిల్లాకు 4.23 కోట్ల రూపాయల యంత్ర సేవా పథకం సబ్సిడీ విడుదల


 జిల్లాకు 4.23 కోట్ల రూపాయల  యంత్ర సేవా  పథకం సబ్సిడీ విడుదల 


వ్యవసాయ రంగంలో సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించొచ్చు

జిల్లా కలెక్టర్



పుట్టపర్తి, జూన్ 7 (ప్రజా అమరావతి):  వ్యవసాయ రంగంలో సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించవచ్చునని జిల్లా కలెక్టర్  బసంత కుమార్  తెలిపారు. మంగళవారం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని  బీడు పల్లి రోడ్డున ఉన్న  క్రికెట్ గ్రౌండ్ నందు  జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం జిల్లాస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో  పార్లమెంటు సభ్యులు  గోరంట్ల మాధవ,  ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్  తదితరులు  పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ వ్యవసాయంలో వ్యయం తగ్గించి ఆదాయం పెంచుటకు, రైతులను ఆదుకునేందుకు యంత్ర సేవా పథకాన్ని  ప్రారంభించడం జరిగిందన్నారు.  ఈ పథకం ద్వారా  జిల్లాలో 137  రైతు గ్రూపులకు  రూ 15.85 కోట్లు విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు  తక్కువ  అద్దెకు   యంత్ర పరికరాలు ఇచ్చుట  వల్ల రైతుకు ఉపయోగంగా ఉంటుందని అదేవిధంగా సి హెచ్ సి సెంటర్లకు ఆదాయం వస్తుందని తెలిపారు.  

రైతులు సాంప్రదాయ విధానాలు వదలి, ఆధునిక పద్ధతులు పాటించి  వ్యవసాయం చేయాలన్నారు.  వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అని, దానివల్ల రైతుకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు.  యంత్రాలు కొనుగోలులో రైతులకు నచ్చిన వాహనాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. యంత్రాలు కొనుగోలులో  రైతు వాటాగా 10శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణ సదుపాయం కల్పిస్తోందని తెలిపారు.  రైతులు లో సహకార ధోరణి మళ్లీ రావాలి,  చిన్న కమతాలు ఎక్కువయ్యాయి  చిన్న రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం మంచి పద్ధతి  అని తెలిపారు. పరస్పర సహకారంతో మరిన్ని లాభాలు పొందవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 24 పథకాలు  అర్హులైన లబ్ధిదారులకు ఖాతాల్లోకి నేరుగా జమ జరుగుతున్నదని పేర్కొన్నారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా  పారదర్శకంగా   వివిధ సంక్షేమపథకాలు లబ్ధిదారులకు  చేరవేయడం జరుగుతుందని తెలిపారు.

హిందూపురం పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ

రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న అనేక పథకాలలో యంత్ర సేవా పథకం ఒకటని తెలిపారు.   ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి పాదయాత్రలో తెలుసుకున్న రైతుల కష్టాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం  కారణంగా ఇబ్బందులు చూసి వ్యవసాయానికి సహాయం చేయాలని, ప్రోత్సహించాలని అనేక  పథకాలు    ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.  పట్టణీకరణ కారణంగా గ్రామాలలో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడిందని, దాన్ని ఎదుర్కొనుటకు, రైతులను ప్రోత్సహించుటకు వైయస్సార్ యంత్ర సేవ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుల పక్షపాతిగా  ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్  జగన్  మోహన రెడ్డి   చరిత్రలో నిలిచిపోతారని  తెలిపారు.


ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ వ్యవసాయం యాంత్రీకరణ చేయాలని ఈ పద్ధతి ఉద్దేశమని, దీనివల్ల రైతులకు సాగుబడి ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు.  రైతులకు విత్తనాలు నుండి పంట కొనుగోలు వరకు సేవలు అందించుటకు  రైతు భరోసా కేంద్రాలు  ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా యంత్రాంగం రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేయాలని కోరారు.   కులమతాలు పార్టీలకు  అతీతంగా అర్హత ప్రామాణికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్  మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఆయా గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అంటూ కుటుంబ సభ్యులను అడిగి  తెలుసుకున్నాము. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ది నేరుగా అర్హులకు అందుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.


     జిల్లా సలహామండలి బోర్డు చైర్మన్   రమణారెడ్డి  మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు కొరత గల  ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయం చెయ్యడం కష్టమని,  ఈ సమస్యను ఎదుర్కొనుటకు యాంత్రీకరణ తప్పనిసరి అని తెలిపారు.  క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.  రైతులకు యంత్ర పరికరాలు వ్యక్తిగతంగా కూడా అందించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.  అనంతరం  అతిథులు చేతుల మీదుగా సబ్సిడీ రూపంలో మెగా చెక్కును అర్హులైన రైతులకు  అందజేశారు, ట్రాక్టర్ ర్యాలీ జెండా ఊపి  కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ గోరంట్ల మాధవ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణ

ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శివ నారాయణ, బుక్కపట్నం ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,  పూడా చైర్మన్ లక్ష్మీ నరసమ్మ, పుట్టపర్తి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, పుట్టపర్తి ఎంపీపీ రమణారెడ్డి గారు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


      

    

Comments