జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రూ. 943 కోట్లతో రహదారుల నిర్మాణం

 *జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రూ. 943 కోట్లతో రహదారుల నిర్మాణం*


*మరో రూ.133.69 కోట్లతో రహదారుల పనులకు   ప్రతిపాదనలు*


*జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు*


*కర్నూలు, జూన్ 11 (ప్రజా అమరావతి): జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రూ. 943 కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.133.69 కోట్లతో రహదారుల పనులకు ప్రతిపాదనలు పంపామని, వీటికి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేయనుందని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు*


*శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖల ద్వారా చేపడుతున్న రోడ్ల నిర్మాణాలను గురించి కలెక్టర్ వివరించారు. విలేకరుల సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు*.


*ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 25.49 కోట్లతో 7 నియోజకవర్గాలలో 216 కిలోమీటర్ల పొడవున  గుంతలు లేని రోడ్లు గా తీర్చి దిద్దేందుకు 60 పనులను  చేపట్టడం జరుగుతోందని, ఈనెల 20 వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తయి, మూడు నెలల లోపల పనులను పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.. మరో 577 కిలోమీటర్ల పొడవున గుంతలు లేని రోడ్లు గా మరమ్మతులు చేసేందుకు  రూ.133.69 కోట్లతో  ప్రతిపాదనలు పంపామని, వీటికి ఈ నెలాఖరు లోపు ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేయనుందన్నారు*.


*ఏపీ పంచాయతీ రాజ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు కింద రోడ్ కనెక్టివిటీ లేని, 250 జనాభా కంటే ఎక్కువ ఉన్న 85 నివాసిత గ్రామాల్లో   రూ 189.11 కోట్లతో 190 కిలోమీటర్ల పొడవున రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోన్దన్నారు. ఇందులో 30.82  కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం పూర్తి అయిందని, మిగిలిన 160 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చేస్తామని తెలిపారు*


*ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద 91.07 కిలోమీటర్ల పొడవున రూ 27.03 కోట్లతో 8 రోడ్డు పనులు జరుగుతున్నాయని, ఇందులో 7 పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఒక్క పని జులై నెల 15వ తేదీ లోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు*


*PMGSY ఇన్సెంటివ్స్ కింద రూ . 10 కోట్లతో 77 కిలోమీటర్ల పొడవున 24 పనులు జరుగుతున్నాయని, వీటిలో 18 పనులు పూర్తయ్యాయని, మరో ఆరు పనులు జూలై నెలాఖరులోపు పూర్తవుతాయని తెలిపారు**ఆర్ అండ్ బీ శాఖ ద్వారా 792 కిలోమీటర్ల పొడవున 691.61 కోట్లతో 134 పనులు జరుగుతున్నాయని, ఇందులో 55 పనులు పూర్తి కాగా,42 పనులు పురోగతిలో ఉన్నాయని, మరో 37 పనులు జూలై 15 లోపు ప్రారంభిస్తామని కలెక్టర్ వివరించారు* .


*పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల నిర్మాణాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా పని చేయడమే తమ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.*.


 Comments