నెల్లూరు (ప్రజా అమరావతి);
ఓటర్ల జాబితా కి సంబంధించి పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను ఈ నెలాఖరు నాటికి క్లియర్ చేయాల
ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు.
గురువారం ఉదయం వెలగపూడి లోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఎక్స్ అఫిషియో కార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మీన, ఓటర్ల జాబిత మరియు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కల్లెక్టర్లతో సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారిచేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లను ప్రాధాన్యత అంశంగా తీసుకుని పరిష్కార దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో వున్న క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ను ఈ నెలాఖరు నాటికి క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ స్థాయి సహాయకుల నియామక ప్రతిపాదనలు, డి.ఈ.ఓ., ఈ.ఆర్.ఓ., ఎ.ఈ.ఆర్.ఓ. ల నియామక ప్రతిపాదనలు, ఎలెక్షన్ ఫండ్స్ ఆడిట్ రిపోర్ట్స్ పంపే అంశం, ఎలెక్టోరల్ రోల్స్ లోని సవరణలు, బి.ఎల్.ఓ మాగజైన్ కు సంబంధించి విజయ గాథలు, బెస్ట్ ప్రాక్టీసెస్ లాంటి పలు అంశాలపై జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో ఫారం 6కు సంబంధించి 1,035 దరఖాస్తులు, ఫారం 7కు సంబంధించి 10,798 దరఖాస్తులు పెండింగ్ లో వున్నాయని, త్వరలో వీటిని క్లియర్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఈ.సి.ఐ నిబందనల మేరకు జిల్లాలోని బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ ల నియామక ప్రక్రియ చేపట్టిన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో నెల్లూరు మునిసిపల్ కమీషనర్ కుమారి జాహ్నవి, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, జడ్.పి. సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.ఆర్.డి.ఎ, డ్వామా పి.డి లు శ్రీ సాంబశివా రెడ్డి, శ్రీ తిరుపతయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment