తాడేపల్లి (ప్రజా అమరావతి);
బైపాస్ రోడ్డులోని ప్రాతూరు క్రాస్ రోడ్స్ వద్ద శ్రీ ఫార్చున్ గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి
*సజ్జల రామకృష్ణా రెడ్డి పాయింట్స్:*
తాడేపల్లి లాంటి ప్రాంతంలో అన్నీ సౌకర్యాలతో స్టార్ హోటల్ హంగులతో అధునాతన హోటల్ ను ప్రారంభించడం శుభ పరిణామం
వీఐపీ జోన్ లాంటి ఏరియాలలో ఇలాంటి హోటల్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు
శ్రీ ఫార్చున్ గ్రాండ్ హోటల్ విజయవంతం కావాలని ఆయన అన్నారు
ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఆహ్లాదకమైన వాతావరణంలో అడ్వాన్స్ డ్ ఇంటీరియర్ టెక్నాలజీతో నిర్మించామని వేగంగా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి ఈ హోటల్ ఒక మణిహారంలాంటిదని అన్నారు శుభకార్యాలకు అనువుగా కాన్ఫరెన్స్ హాల్, బ్లాంకెట్ హాల్ ఏర్పాటు చేయటం జరిగిందని మంచి ఫుడ్, సౌకర్యం ఏర్పాటు చేయగల నమ్మకం ఉందని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment