పెండింగ్ అంశాలపై దృష్టి సారించాలి

 పెండింగ్ అంశాలపై దృష్టి సారించాలి*


- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా -
పుట్టపర్తి, జూన్16 (ప్రజా అమరావతి): ఓటర్లకు చెందిన క్లయిములు, అబ్జెక్షన్లు, పిటిషన్లు, డూప్లికేట్ ఓటర్లతో పాటు పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్లు దృష్టి సారించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఎక్స్ అఫిషియో కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను కోరారు. ఓటర్ల జాబితాకు చెందిన పలు అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు నోటీసులు అందజేయడం, 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు ప్రాధాన్యత అంశంగా తీసుకుని పరిష్కార దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే క్లయిములు,అబ్జెక్షన్లు,పిటిషన్ల పెండింగ్ అంశాలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ స్థాయి సహాయకుల నియామక ప్రతిపాదనలు,జిల్లా ఎన్నికల అధికారులు,ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల నియామక ప్రతిపాదనలపై ఆరా తీశారు. ఎలెక్షన్ ఫండ్స్ ఆడిట్ రిపోర్ట్స్ పంపే అంశాలు, ఎలెక్టోరల్ రోల్స్ లోని సవరణలు,బెస్ట్ ప్రాక్టీసెస్ లాంటి పలు అంశాలపై సమీక్షించిన ఆయన  రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాలు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక కలెక్టరేట్లోని  జిల్లా కలెక్టర్  బసంత  కుమార్    చాంబర్ నందు వర్చువల్ విధానములో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎన్నికల పిటిషన్లకు సంబంధించి ఇప్పటికే అఫీడివేట్ చేయడం జరిగిందన్నారు. బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ ల నియామకాలు జరిగిపోయాయని, వీటికి చెందిన నివేదికలు పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో59612 క్లయిములు ఉన్నాయని, వాటిలో53,684 క్లయిములు  పరిష్కరించడం జరిగింది. మిగిలినవి 24 48 క్లయిములు  ఉన్నాయి  వాటిని వారంలోగా క్లియర్ చేస్తామన్నారు. డూప్లికేట్ ఓట్లు  ఉన్నాయని, వాటిని కూడా వారంలో క్లియర్ చేస్తామని కలెక్టర్ వివరించారు. ఎలెక్టోరల్ లో డోర్ నెంబరు జీరోతో ఉన్నవి  కొన్ని ఉన్నాయని వాటిని వారంలో క్లియర్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  ఇన్చార్జి జాయింట్ కలెక్టర్  ఎం నవీన్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్  సురేష్ కుమార్ ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Comments