అమరావతి భూములమ్మే నైతిక హక్కు సీఎంకు లేదు.


 అమరావతి (ప్రజా అమరావతి);


_*మాజీ మంత్రివర్యులు, శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ 


అమరావతి భూములమ్మే నైతిక హక్కు సీఎంకు లేదు.

జీఓ ఎంఎస్ 390ని రద్దు చేయాలి*

ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతి భూములను అమ్మే హక్కు ఎక్కడుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 

 మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

 జగన్ పాలనలో రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 

 దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న ప్రభుత్వం జీవో ఎంఎస్ 390ని విడుదల చేశారని తెలిపారు. 

 రాజధాని పరిసర ప్రాంతాలు విజయవాడ, తెనాలి లోని 304 ఎకరాల భూమిని జూలై రెండవ వారంలో కొన్ని, నాల్గవ వారంలో కొన్ని అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయం చేస్తే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రాజధానిని మూడు ముక్కలు చేయాలని కుట్రచేసిన ముఖ్యమంత్రి అదే రాజధానిలోని భూములను లీజుకు ఇవ్వడం, అమ్మాలని చూడడం ఎంత వరకు సబబని నిలదీశారు. 


 ముఖ్యమంత్రికి అసలు నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. 

 రాజధాని అమరావతిపై గౌరవ హైకోర్టు 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును జగన్ రెడ్డి తుంగలో తొక్కారని మండిపడ్డారు. 

గత ప్రభుత్వం రాజధాని రైతులకు చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని, వారికి సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని కోర్టు తీర్పునిస్తే, ముఖ్యమంత్రి అది చేయకుండా ఆ స్థలాలను అమ్మేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. 

 అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యక్తిగత చర్యలకు దిగితే రాజధాని ప్రాంతం ప్రజలు, రైతులు సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ రాజధానికి తమ భూములను త్యాగం చేసిన రైతులు, నేడు రాజధానిని కాపాడుకోవడానికి గత మూడేళ్లుగా పోరాడుతూనే ఉన్నారన్నారు. 

 అటువంటి రైతులపై వైసీపీ ప్రభుత్వం ఆడ, మగ, మహిళ, పిల్ల తేడా లేకుండా పోలీసులతో మూకుమ్మడి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. రైతులు చేస్తున్న పోరాటనికి పేటీఎం పోరాటమని విమర్శించి అవమానపరిచారన్నారు. 

 రాజధాని ప్రాంతంలోని దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని కేవలం ఎడారి, శ్మశానం, త్రీడీ గ్రాఫిక్స్ అని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, తన అనుచరగణం నేడు సిగ్గులేకుండా ఏ విధంగా అదే భూములను అమ్మాలని చూస్తున్నారని విమర్శించారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ మూడేళ్లలో తలకు మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. అప్పుల సమస్యలతో రాష్ట్రాన్ని ముందుకు నడపలేని దుస్థితిలో అమరావతి భూములపై జగన్ కన్ను పడిందని తెలిపారు.ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోసందన్నారు. 

 గత ప్రభుత్వం ప్రారంభించిన హ్యాపీ నెస్ట్ ను సీఎం నీరుగార్చారని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ ఫలాలు దక్కాలంటే ప్రతి విషయంలోనూ కోర్టుకు వెళ్లే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతుల త్యాగ ఫలితంతో ఏర్పడిందే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ...వీటికి వెళుతున్న సీఎంకు రైతులు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. 

రాజధానిని నిలబెట్టుకోవడానికి చేసిన పోరాటాల్లో ఎందరో రైతులు అశువులుబాశారని తెలిపారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన ముఖ్యమంత్రికి రాజధాని పోరాటంలో అశువులుబాసిన రైతులు గుర్తుకు రాలేదా, వారికి ఓదార్పు యాత్రలు లేవా అని కోరారు. రాజధాని భూములు లీజుకు ఇవ్వడం, అమ్మడం వంటి చర్యలను సీఎం ఉపసంహరించుకోవాలని, జీఓ ఎంఎస్ 390ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపోరాటానికి రైతాంగం, రాజధాని ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Comments