ప్రతి మండలంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం

 మనసు పెట్టి స్పందన గ్రీవెన్స్ లకు పరిష్కారం చూపించాలి

ప్రతి మండలంలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


తలుపుల మండల కార్యాలయంలో నిర్వహించిన మండల  స్థాయి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్*


తలుపుల (శ్రీ సత్యసాయి జిల్లా),  జూన్22 (ప్రజా అమరావతి):


*స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు.  తలుపుల మండల  ప్రజా పరిషత్  ప్రధాన ఆర్డీఓ కార్యాలయంలో  బుధవారం మధ్యాహ్నం12 గంటలు నుంచి  మధ్యాహ్నం 3  గంటలు వరకు నిర్వహించిన  మండల స్థాయిస్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో  155   అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు  ఆర్డిఓ రాఘవేంద్ర  ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  తలుపుల మండలంలో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు మంచి చర్య అని, సుదూర ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వచ్చి అర్జీ ఇచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత స్థానిక అధికారులదేనన్నారు. ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కరం ఇవ్వడం జరుగుతుందన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీల్లో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి 90 శాతం అర్జీలను స్వీకరించడం జరిగిందని, 

ఈరోజు స్పందనలో  వచ్చిన అర్జీలను  అర్జీలను స్వీకరించడం జరిగింది తెలిపారు 

వాటికి రాబోయే 15 రోజుల్లో ఆర్డీఓతో మాట్లాడి మళ్ళీ రాకుండా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని, అర్జీలకు నాణ్యమైన పరిష్కారం విషయమై చర్చించాలని, నాణ్యతగా పరిష్కారం చూపించాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను నమ్మేలా పరిష్కారం ఉండాలని, ప్రతి అర్జీలను మనసు పెట్టి పరిష్కరించాలన్నారు. స్పందన గ్రీవెన్స్ పరిష్కారానికి అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని  తెలిపారు

స్పందన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్ళకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. అర్జీ దారునికి అర్థమయ్యే విధంగా పరిష్కార నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు.  ప్రతి మండలంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు డబ్బులు ఖర్చు పెట్టి జిల్లా కేంద్రానికి మీరు రావడం ఇష్టం లేకనే నేను మీ వద్దకు వచ్చానని తెలిపారు. పంటల బీమా పథకం పరిహారం మంజూరులో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన జాబితాను గ్రామ సచివాలయంలో ఆర్.బి కేంద్రాలలో ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఈ మండలంలో తాగునీటి బకాయి బిల్లులు  చెల్లించడం లేదని ఫిర్యాదులు అందాయని. వాటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంపీడీవో సమగ్ర రికార్డులు పరిశీలించి త్వరలో  వారికి బిల్లులు సకాలంలో చెల్లించడం జరుగుతుందని  తెలియ చెప్పాల్సిన బాధ్యత  సంబంధిత అధికారులపై ఉన్నదని  పేర్కొన్నారు.  రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ సచివాలయం  ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తాసిల్దార్ రవి, ఎంపీడీవో రామ్ నాయక్ ,ఎంపీపీ మహమ్మద్ రఫీ, సర్పంచి శ్రీలత, వ్యవసాయ అధికారి విద్యావతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments