ఇంటర్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభఇంటర్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ


రాష్ట్ర సగటును మించిన ఫలితాలు సాధించిన విద్యార్థులు

84.34 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నెల్లూరు జిల్లా

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.


అమరావతి, జూన్ 22 (ప్రజా అమరావతి): ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాలకు సంబంధించి ఇంటర్ పరీక్షల్లో 84.34 శాతం ఫలితాలను సాధించి నెల్లూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందని తెలిపారు.

బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీఆర్ అంబేద్కర్ గురుకులాలకు చెందిన విద్యార్థులు సాధించిన ఫలితాలను నాగార్జున వివరించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 11776 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 6713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని చెప్పారు. ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలలో 10958 మంది హాజరు కాగా వారిలో 7745 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని తెలిపారు. జూనియర్ ఇంటర్ లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 54 శాతం కాగా తమ గురుకులాల విద్యార్థులు 57 శాతం ఉత్తీర్ణతను సాధించారని, అలాగే సీనియర్ ఇంటర్ లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 61 శాతం కాగా తమ విద్యార్థులు 70.67 శాతం ఉత్తీర్ణతను సాధించగలిగారని నాగార్జున వెల్లడించారు. జూనియర్ ఇంటర్ లో 4229 మంది విద్యార్థులు, సీనియర్ ఇంటర్ లో 3941 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణి ఫలితాలను సాధించారని చెప్పారు. జూనియర్ ఇంటర్ పరీక్షల్లో పార్వతీపురం జిల్లాకు చెందిన కొమరాడ గురుకుల పాఠశాల, బాపట్ల జిల్లాకు చెందిన నిజాంపట్నం గురుకుల పాఠశాలలు 100% ఫలితాలను సాధించడం జరిగిందని తెలిపారు. సీనియర్ ఇంటర్ పరీక్షల్లో కొమరాడ, నిజాంపట్నం గురుకులాలతో పాటుగా అన్నమయ్య జిల్లాకు చెందిన దేవపట్ల గురుకుల పాఠశాల కూడా 100% ఫలితాలను సాధించడం జరిగిందని నాగార్జున వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 84.34 శాతం ఫలితాలతో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలోనూ, 77.25 శాతం ఫలితాలతో కృష్ణా జిల్లా ద్వితీయస్థానంలోనూ నిలిచాయని మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఈ సందర్భంగా నాగార్జున అభినందించారు.


Comments