*పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతాం*
పురపాలక పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో తమ నైపుణ్యత ద్వారా భాగస్వాములవుతామని తమకు అవకాశం కల్పించాలని మెల్బోర్న్ లోని DEAKIN యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్ వినతి పత్రం సమర్పించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ విషయంలో DEAKIN యూనివర్సిటీ సాధించిన నైపుణ్య ప్రత్యేకతలను మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాభివృద్ధి కార్యక్రమాలకు తమ నైపుణ్యతను వినియోగించుకోవాలని మంత్రిని కోరారు.
addComments
Post a Comment