ఈరోజు అనగా ది.01-06-2022 న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం , ఇంద్రకీలాద్రి నకు
దత్తత దేవాలయమైన కొలనుకొండ లోని శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనుల
లో భాగంగా ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు వైష్ణవ శాస్త్ర ప్రకారముగా పూజాది కార్యక్రమములు నిర్వహించి శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమమునకు గౌరవనీయులైన MLC శ్రీ హనుమంతరావు గారు మరియు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణా రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వీరు ఆలయ పునర్నిర్మాణ పనుల శిలాఫలకమును ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు , ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్.రమాదేవి గారు, సహాయ కార్యనిర్వహణాధికారి వార్లు, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ రవీంద్ర గారు, స్ధపతి షణ్ముగం గారు, ఇంజినీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment